Advertisement
పెళ్లి సందడి పిల్ల డాక్టర్ అయిందోచ్ ..
Latest Movies Tollywood

పెళ్లి సందడి పిల్ల డాక్టర్ అయిందోచ్ ..

Advertisement
ఫస్ట్ మూవీతోనే ఎంటైర్ టాలీవుడ్ పై బెస్ట్ ఇంప్రెషన్ వేసిన బ్యూటీ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాలో తను చేసిన సందడి అంతా ఇంతా కాదు. వైబ్రంట్ లుక్స్ తో పాటు అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో తనను చూసిన వారంతా ఫిదా అయిపోయారు. తను టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందని అంతా జోస్యం కూడా చెప్పారు. వాళ్లు చెప్పినట్టుగానే అమ్మడికి ఓవర్ నైట్ వచ్చిన క్రేజ్ తో పాటు ఆఫర్స్ కూడా పెరిగాయి. బట్ తను మాత్రం ఆ టైమ్ లో గ్యాప్ తీసుకుంది. ఎందుకో తెలుసా.. చదువుకోవడానికి. యస్.. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. అంత క్రేజ్ ను క్యారీ చేయకుండా ఎడ్యుకేషన్ పై కాన్సంట్రేట్ చేసింది.
పెళ్లి సందడి సినిమా చేయడానికి వచ్చినప్పుడే శ్రీ లీల ఎమ్.బి.బి.ఎస్ చదువుతోంది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అయితే తనదైన మాగ్నటిక్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన శ్రీలీల కు ఆఫర్స్ వెల్లువెత్తాయి. అవన్నీ కాదని.. డాక్టర్ చదవడానికే ప్రాధాన్యం ఇచ్చింది. అఫ్ కోర్స్ ఆ టైమ్ లో మాస్ రాజా రవితేజతో ధమాకా సినిమా ఒప్పుకుంది. ఈ సినిమా ఒప్పుకున్నందుకు కూడా తనపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఏజ్ బార్ హీరోతో రొమాన్స్ అవసరమా అన్న కమెంట్స్ కూడా వచ్చాయి. అవన్నీ తను పట్టించుకోకుండా పరీక్ష రాసింది. రీసెంట్ గా రిజల్ట్ వచ్చింది. శ్రీ లీల ఎమ్.బి.బి.ఎస్ పాసై డాక్టర్ పట్టా పుచ్చుకోబోతోంది.
మరో విశేషం ఏంటంటే.. తను సినిమాల్లో నటిస్తూనే ఎమ్ఎస్ చేయడానికి రెడీ అవుతోందట. అంటే కేవలం సినిమానే కెరీర్ గా కాక తన లైఫ్ లాంగ్ ఉపయోగపడేలా పర్మనెంట్ కెరీర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటోందన్నమాట. సో.. డాక్టర్ పట్టా పుచ్చుకుని ఇటు ప్రేక్షకులకు తన గ్లామర్ మెడిసిన్ పంచుతూనే అటు ఎమ్ఎస్ కూడా చేసి ఫ్యూచర్ ప్లాన్స్ ను అమలు చేయబోతోందన్నమాట. ఎనీ వే కంగ్రాట్స్ పాపా..

Advertisement