ఆస్కార్ రేసులో ట్రిపుల్ ఆర్‌, ఉత్త‌మ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, ఉత్త‌మ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో నామినేష‌న్లు గ్యారంటీ అన్న‌ది మొన్న మొన్న‌టిదాకా అంద‌రినీ ఊరించిన మాట‌. ఉత్త‌మ హీరోలుగా ఎన్టీఆర్ పోటీప‌డతార‌ని అంద‌రూ అనుకున్నారు, స‌డ‌న్‌గా ఈ మ‌ధ్య ఈ రేసులో రామ్‌చ‌ర‌ణ్ పేరు కూడా వినిపించింది. వెరైటీ మేగ‌జైన్ రాసిన వార్త‌ల‌ను బ‌ట్టి గ‌త కొన్నాళ్లుగా ఆస్కార్ రేసులో త‌మ హీరోలున్నార‌ని ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. కానీ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ప్ర‌క‌టించిన వార్త చూసి అంద‌రి ఆశ‌లూ అడియాస‌ల‌య్యాయి. గుజ‌రాత్ సినిమా చ‌లో షోకి ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ కేట‌గిరీలో అవ‌కాశం ద‌క్కింది.

దీనివ‌ల్ల ట్రిపుల్ ఆర్‌, గంగూభాయ్‌, కాశ్మీరీ ఫైల్స్ అన్నీ వెన‌క‌బ‌డ్డాయి.ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా పంప‌క‌పోయిన‌ప్ప‌టికీ, జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో ట్రిపుల్ ఆర్ పోటీ ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు కొంద‌రు అనుభ‌వ‌జ్ఞులు. దీన్నిబ‌ట్టి ట్రిపుల్ ఆర్ సినిమా యూనిట్‌, విడిగా నేరుగా జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి అప్లై చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. అయితే సినిమా దేశం త‌ర‌ఫున వెళ్తే, అక్క‌డ‌య్యే ఖ‌ర్చును ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా భ‌రిస్తుంది. విడిగా వెళ్తే ఖ‌ర్చు మొత్తం యూనిట్ భ‌రించాల్సి ఉంటుంది.ఇప్పుడు రాజ‌మౌళి అండ్ టీమ్ ఆ ప్ర‌య‌త్నాలు చేస్తారా? లేదా? అనేది అంద‌రినీ ఊరిస్తున్న విష‌యం. ఒక‌వేళ ఏం నిర్ణ‌యం తీసుకున్నా అక్టోబ‌ర్ 3 లోపు తేలిపోతుంది.

, , , , ,