Advertisement
అంటే సుందరానికి కన్ఫ్యూజన్ ఎక్కువా..?
Latest

అంటే సుందరానికి కన్ఫ్యూజన్ ఎక్కువా..?

Advertisement

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ. మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీస్ సంస్థలో వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రూపొందిన ఈ లవ్ ఎంటర్టైనర్ ని జూన్ 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొద్ది రోజుల నుంచి మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా నిన్న మరో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసింది. నాని కొత్త సినిమా అంటే సుందరానికి. మైత్రీ మూవీస్ బ్యానర్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నానీకి జోడీగా మలయాళ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా నటించింది. తనకిది ఫస్ట్ తెలుగు మూవీ. వీరితో పాటు నదియా, నరేష్, సుహాస్ కీలక పాత్రల్లో నటించారు.

అంటే సుందరానికీ చిత్రాన్ని జూన్ 10న రిలీజ్ చేయబోతున్నారు. అంటే సుందరానికీ చిత్రం ప్రేమకథతో తెరకెక్కింది. ఒక బ్రాహ్మణ యువకుడికీ, ఓ క్రిస్టియన్ అమ్మాయికీ మధ్య సాగే లవ్ స్టోరీతో వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారు. లవ్ తో పాటు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుందని ఆ మధ్య రిలీజైన టీజర్ చూస్తే తెలిసిపోతుంది. అలాగే కొన్ని సాంగ్ కూడా రిలీజై అంటే సుందరానికి మూవీపై బజ్ ని కూడా పెంచాయి. అంటే సుందరానికి చిత్రం నుంచి నిన్న మరో లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. వివేక్ సాంగర్ మ్యూజిక్ అందించాడు. రంగో రంగ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ఇలా పాటల ద్వారా ప్రమోషన్స్ చేస్తోంది టీమ్. సినిమా మీద ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ ఆల్ రెడీ క్రియేట్ అయ్యింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Advertisement