Advertisement
భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ విల‌న్ ఎవ‌రో తెలుసా..?
Latest Movies Tollywood

భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ విల‌న్ ఎవ‌రో తెలుసా..?

Advertisement

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాతో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న మ‌రో సినిమా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వ‌ర‌లో స్టార్ట్ కానుంది. అయితే… ఈ రెండు సినిమాల‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌నున్న మ‌రో భారీ చిత్రం భ‌వదీయుడు భ‌గ‌త్ సింగ్. ఈ చిత్రానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అయితే… ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన గబ్బ‌ర్ సింగ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మ‌రో మూవీ రావాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేష‌న్ సెట్ అయ్యింది. ఈ క్రేజీ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.

Not Vijay Sethupathi But Pawan Kalyan Was The First Choice For  Sangathamizhan - Filmibeat

ఇప్పుడు ఈ క్రేజీ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ భారీ సినిమాలో విలన్ గా సౌత్ ఇండియా ప్రముఖ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నాడట. ఆల్రెడీ విజయ్ విలన్ గా కనిపించి ఏ రేంజ్ లో కిక్ ఇచ్చాడో చూసాం. ఇక పవన్ సినిమాలో విలన్ గా అంటే వేరే లెవెల్లో ఉంటుంది. అయితే.. విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా న‌టిస్తున్న విష‌యాన్ని అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయాల్సివుంది. త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

Advertisement