Advertisement
రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ గురించి సినీ ప్ర‌ముఖులు ఏమ‌న్నారో తెలుసా..?
Bollywood Latest Movies Regional Tollywood

రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ గురించి సినీ ప్ర‌ముఖులు ఏమ‌న్నారో తెలుసా..?

Advertisement

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. అయితే.. ఈ ట్రైలర్ గురించి సినీ ప్రముఖులు ఏమ‌న్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ స్పందిస్తూ… రాజమౌళి సర్‌.. ట్రైలర్‌ చూస్తుంటే మతిపోతోంది. రామ్‌చరణ్‌, తారక్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆలియా భట్‌తోపాటు మొత్తం చిత్రబృందానికి నా అభినందనలు అని తెలియ‌చేశారు. డైరెక్ట‌ర్ క్రిష్ స్పందిస్తూ.. అద్భుత‌మైన‌ ఎలివేషన్స్‌, పవర్‌ఫుల్‌ పాత్రలు, మనసుని హత్తుకునే భావోద్వేగాలతో ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ఈ మేజిక్‌ని వెండితెర పై చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను అన్నారు.

ట్రైలర్‌ చూస్తే గర్వంగా ఉంది. వేరే లెవల్‌ ట్రైలర్‌ ఇది అని విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించ‌గా.. ఎమోషన్‌, యాక్షన్‌ల పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌. ఎన్టీఆర్ – రామ్‌చరణ్‌ల స్క్రీన్‌ ప్రజెన్స్‌ అదరగొట్టేలా ఉంది. మా అంచనాలకు మించి ఈ సినిమా ట్రైలర్‌ ఉంది. మన దేశంలో పుట్టిన ఉత్తమమైన దర్శకుడు రాజమౌళి అని కోన వెంక‌ట్ అన్నారు. ఈ అద్భుతమైన విజువల్స్‌ చూశాక మాటలు రావడం లేదు..! అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో ప్రతిఒక్కరూ ఎంతలా శ్రమించారో ప్రతి ఫ్రేమ్‌లో తెలుస్తోంది. రాజమౌళికి అభినందనలు అని యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల అన్నారు.

అత్యద్భుతం.. మా ఊహలకు మించి ఈ ట్రైలర్‌ని రూపొందించారు. మన తారక్‌, చరణ్‌ అదరగొట్టేశారు. రాజమౌళి సర్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ విజన్ అని అనిల్ రావిపూడి స్పందించ‌గా.. టేక్‌ ఏ బౌ రాజమౌళి.. ట్రైలర్‌ అదిరిపోయింది అని గోపీచంద్ మ‌లినేని అన్నారు. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ట్రైలర్‌ ఆద్యంతం సర్‌ప్రైజ్‌లతో నిండిపోయింది. భావోద్వేగాలు, ఎలివేషన్స్‌పై తనకున్న పట్టుని రాజమౌళి మరోసారి నిరూపించారు అని డైరెక్ట‌ర్ బాబీ అన‌గా.. బిగ్గెస్ట్‌ గ్లోబల్‌ యాక్షన్‌ డ్రామా అనే టైటిల్‌ ఈ ట్రైలర్‌కి సరిగ్గా సెట్‌ అవుతుంది. అద్భుతమైన ప్రపంచం, పాత్రలు.. చూస్తుంటే మాటలు రావడం లేదు. చిత్రబృందానికి నా అభినందనలు అని డైరెక్ట‌ర్ మారుతి అన్నారు. ఇలా సినీ ప్ర‌ముఖులు రాజ‌మౌళి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

Advertisement