Advertisement
అఖండ గురించి బాల‌య్య కూతురు బ్రాహ్మ‌ణి ఏమ‌న్నదో తెలుసా.?
Latest Movies Tollywood

అఖండ గురించి బాల‌య్య కూతురు బ్రాహ్మ‌ణి ఏమ‌న్నదో తెలుసా.?

Advertisement

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ తాజా సంచ‌ల‌నం అఖండ‌. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య చేసిన సినిమాలు ఒక ఎత్తు. అఖండ మ‌రొక ఎత్తు. ఇంత‌ వ‌ర‌కు బాల‌య్య సినిమాలు క‌లెక్ట్ చేయ‌ని విధంగా అఖండ‌ రికార్డ్ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ దూసుకెళుతుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. దీంతో అఖండ సినిమా నిర్మించిన నిర్మాత‌కే కాకుండా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అంద‌రికీ లాభాలు తెచ్చిపెడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. ఫ‌స్ట్ వీక్ లోనే చాలా ఏరియాల్లో లాభాల్లోకి వెళ్లిందంటే.. ఈ సినిమాని ప్రేక్ష‌కులు ఎంత‌గా ఆద‌రిస్తున్నారో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇదిలా ఉంటే.. అఖండ సినిమా గురించి బాల‌య్య కూతురు బ్రాహ్మ‌ణి త‌న స్పంద‌న‌ను తెలియ‌చేసింది. ఇంత‌కీ బ్రాహ్మ‌ణి ఏమ‌న్న‌దంటే.. అఖండ సినిమా అద్భుతంగా ఉంది. అప్పుడు తాత గారు .. ఇప్పుడు నాన్న గారు సినిమా పరిశ్రమ స్టాండర్డ్స్ ను పెంచడంలో కీలకమైన పాత్రను పోషించారు. గతంలో నాన్నగారు చేసిన సినిమాలకి మించి ఈ అఖండ‌ సినిమా ఉంది.

నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కూడా డెఫినెట్ గా ఈ సినిమాను చూడాలి అని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మా మదర్ ను.. ఫాదర్ ను కంగ్రాట్యులేట్ చేయాలనుకుంటున్నాను అంటూ అఖండ సినిమా గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టారు బాల‌య్య ముద్దుల కూతురు బ్రాహ్మ‌ణి.

Advertisement