మనకు హీరోయిన్లు ఎలా ఉన్నా ఫర్వాలేదు. కానీ వారికి పెళ్లైన తర్వాత మాత్రం సంప్రదాయంగానే కనిపించాలి. బట్ వారి లైఫ్ వారిదే అని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా మళ్లీ హీరోలను పెళ్లి చేసుకుంటే వారింక తాము చెప్పినట్టుగానే కట్టూ బొట్టుతోఉండాలనుకుంటనే చాదస్తం బ్యాచ్ కూడా యంగ్ స్టర్స్ లో కనిపిస్తుంది. ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిన సమంత తర్వాత అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లికి ముందు తనను తన గ్లామర్ షోస్ చూసి చొంగలు కార్చుకున్నవాళ్లు.. తర్వాత తను కాస్త హాట్ గా ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో పెడితే ఓ రేంజ్ లో కామెంట్స్ చేశారు. సోకాల్డ్ సంప్రదాయ వాదులైతే ఇంక రెచ్చిపోయారు కూడా. పెళ్లి తర్వాత కూడా ఇలా ఉంటుందేంటీ.. ఇంట్లో ఏమీ అనడం లేదా.. అని మరో అడుగు ముందుకు వేసి సమంత బరితెగించింది అని కూడా అన్నారు.

అంతకు మించిన కామెంట్స్ ను కూడా సోషల్ మీడియాలో పెట్టేశారు. బట్ మొగుడూ పెళ్లాం కుదురుగా ఉన్నంత వరకూ అవేవీ వారిని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఒక్కసారి మనస్పర్థలు మొదలైతే ఈ కామెంట్స్ కూడా పరిగణలోకి వస్తాయి. వచ్చాయా లేదా అనేది పక్కన బెడితే ఇప్పుడు వాళ్లిద్దరూ విడిపోయారు. అయితే ఇప్పుడు సమంత లాగానే మరో పెద్ద ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా అలాగే కనిపిస్తోంది.


స్నేహారెడ్డి హీరోయిన్ కాదు. కనీసం నటిగానూ ఎప్పుడూ కనిపించలేదు. పైగా ఇద్దరు బిడ్డల తల్లి. అయినా తన పర్సనల్ లైఫ్ తనది. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో తను కూడా కాస్త హాట్ హాట్ గా కనిపించే ఫోటోస్ ను పోస్ట్ చేస్తోంది. వీటిని చూసిన చాలామంది తను కూడా హీరోయిన్(..?) గా మారబోతోందా అంటూ మాట్లాడుకుంటున్నారు తప్ప.. సమంతను చేసిన కమెంట్స్ చేయడం లేదు.

నిజానికి సమంత ఆ విషయంలో ముందు నుంచి ప్రిపేర్డ్ గానే ఉంది. ఓ హీరోయిన్ గా, లేటెస్ట్ ఫ్యాషన్స్ ను ఫాలో అయ్యే లేడీగా.. తను కట్టు బొట్టు కనిపించాయి. అందుకు పెళ్లి విషయం ఏ అడ్డంకీ కాదు. కానీ ఇప్పుడు స్నేహ అలా కాదు కదా..? అయినా ఆమెను కమెంట్స్ చేసే దమ్ము ఈ సోకాల్డ్ డ్యాష్ బ్యాచ్ కు ఉందా..? చేస్తే అల్లు ఆర్మీ ఊరుకుంటుందా అంటే ఖచ్చితంగా రివర్స్ అటాక్ చేస్తారు. బట్ ఈ ఆర్మీ అప్పుడు సమంతకు లేదు కాబట్టి తను అనవసరంగా బలి అయింది.


సో చివరగా చెప్పొచ్చేదేంటంటే.. కట్టు బొట్టూ.. అనేవి వ్యక్తిగత అంశాలు. నీకో నాకో ఇష్టం వచ్చినట్టు అవతలి వ్యక్తి ఉండాల్సిందే అనుకోవడం అంటే.. మూర్ఖుడు సిగ్గుపడే పదం ఇంకేదైనా వెదకాల్సి ఉంటుంది.

, , , , ,