ఫ్రైడే వచ్చిందంటే చాలు.. ఒక్కోసారి క్లియరెన్స్ సేల్ ను తలపించేలా వరుసగా వచ్చేస్తున్నాయి సినిమాలు. ఇంతకు ముందులా కాక ఈ సారి కాస్త పేరున్న సినిమాలే వస్తున్నాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా ఈ 21న విడుదలవుతోంది. విశ్వక్ సరసన మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దేవుడి పాత్రలో వెంకటేష్ కనిపిస్తున్నారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓ మై కడవులే చిత్రానికి రీమేక్ గా వస్తోన్న ఈ మూవీకి ఒరిజినల్ ను రూపొందించిన అశ్వత్ మారిముత్తునే దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీకి హిట్ కళ కనిపిస్తోందంటున్నారు.మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా కూడా ఈ 21నే విడుదల కాబోతోంది. విష్ణు సరసన పాయల్ రాజ్ పుల్, సన్నిలియోన్ హీరోయిన్లుగా నటించారు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో సూర్యా అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం ఇది.

టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుందీ సినిమా. విష్ణు ఫస్ట్ టైమ్ ఓ హారర్ కామెడీలో నటించాడని తెలుస్తోంది. మరి ఈ మూవీతో మంచు విష్ణు మంచి విజయం అందుకుంటాడా లేదా అనేది చూడాలి.తమిళ్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్ను శివకార్తికేయన్ ఫస్ట్ టైమ్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేశాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రిన్స్. శివకార్తికేయన్ సరసన మారియా అనే ఉక్రెయిన్ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. కట్టప్ప సత్యరాజ్ లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రెండు దేశాలకు చెందిన వ్యక్తులు ప్రేమించుకుంటే ఏం జరిగింది అనే కాన్సెప్ట్ తో వస్తున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ ప్రిన్స్ కూడా 21నే బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు.

ఫస్ట్ మూవీ నుంచే తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటోన్న తమిళ్ స్టార్ కార్తీ. కార్తీ లేటెస్ట్ మూవీ సర్దార్. గతంలో అభిమన్యుడు, హీరో అనే సినిమాలతో ఆకట్టుకున్న పిఎస్ మిత్రన్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కార్తీ ఐపిఎస్, రా ఏజెంట్ అంటూ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. అతని సరసన రజీషా విజయన్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ చూస్తోంటే సర్దార్ బాక్సాఫీస్ వద్దా సర్దార్ అనిపించుకునేలా ఉన్నాడు అంటున్నారు. మొత్తంగా ఈ చతుర్ముఖ పోటీలో సూపర్ హిట్ అందుకునే ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో చూడాలి.

, , , , , , ,