ad

కాంపిటీషన్ ఉంటేనే ఖలేజా ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాల విషయంల ఈ మాట తరచూ వాడాలనుకుంటారు. ముందు బాక్సాఫీస్ బరిలో ఉన్నాము అని చెప్పుకున్నా.. తీరా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చే టైమ్ కు పోస్ట్ పోన్ అంటూ వాయిదా కబురు చెప్పేస్తుంటారు. ఎప్పుడో ఆగస్ట్ 12న విడుదల అని పోస్టర్ వేసుకున్న ఓ టాప్ హీరోయిన్ సినిమాకు సంబంధించి కూడా ఇప్పుడు అదే వినిపిస్తోంది. మరి ఈ పోస్ట్ పోన్ ఎందుకూ అంటారా..? ఎందుకేముందీ.. ఆ టైమ్ కు అమ్మడికి షాక్ ఇచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి ఆ టైమ్ కు.. ఇంతకీ ఆ సినిమా ఏంటో అంటారా..?మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ అనిపించుకున్న భామ సమంత. కొన్నాళ్ల క్రితం తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ నుంచి మెల్లగా బయటకు వచ్చేసిన శామ్.. ఆ బాధను మరిచేందుకు సినిమాలనే ఎంచుకుంది. వరుసగా భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది. అలా అనౌన్స్ అయిన సినిమాల్లో ఒకటి యశోద. హరి – హరీష్‌ ద్వయం డైరెక్ట్ చేసిన ఈ మూవీని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇద్దరు కొత్త దర్శకులు రూపొందించిన యశోద చిత్రం ఓ థ్రిల్లర్ అని చెప్పారు. తెలుగు, తమిళ్ బై లింగ్వుల్ గా వస్తోన్న యశోద చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేస్తామని ఆ మధ్య ప్రకటించారు.

కానీ ఆ తర్వాత ఆ ఊసేదీ కనిపించడం లేదు.ఇప్పుడు ఏ సినిమా అయినా విడుదలకు రెండు నెలల ముందు నుంచే సందడి మొదలవుతుంది. కానీ యశోద విషయంలో అలాంటిదేం కనిపిచడం లేదు. అందుకు కారణం.. సినిమాను వాయిదా వేయాలనుకోవడమే అని టాక్. ఎందుకంటే ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్ హీరోగా నాగ చైతన్య ఓ కీలక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా విడుదలవుతోంది. ఆ తర్వాతి రోజు ఏజెంట్, మాచర్ల నియోజకవర్గం మూవీస్ రాబోతున్నాయి. అలాగే 13న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న స్వాతిముత్యం రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. సో ఈ పోటీలో శామ్ నటించిన విమెన్ సెంట్రిక్ మూవీకి ఇబ్బంది తప్పదు అని భావించే యశోదను వాయిదా వేశారు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది మూవీ టీమే చెప్పాలి. బట్ తను కూడా ఉంటే ఆమె కెపాసిటీ ఏంటో బాక్సాఫీస్ కూ తెలిసిపోతుంది కదా అంటున్నారు చాలామంది. అదీ నిజమే.. ఈ మూవీతో తన రేంజ్ ఏంటో అందరికీ అర్థం అవుతుంది.

, , , , , , ,