సమంత ఇప్పుడు ఎక్కడుంది? ఇండియాలో ఉందా? ఫారిన్‌ కంట్రీస్‌కి వెళ్లిందా? అసలు ఆమెకు ఏమైంది? మొన్న మొన్నటిదాకా స్పీడ్‌గా స్ప్రెడ్‌ అయిన ఈ వార్త మళ్లీ ఇంకోసారి వార్తల్లోకి వచ్చింది. కెరీర్‌ స్టార్టింగ్‌ డేస్‌లో సమంతకు అటాక్‌ అయిన స్కిన్‌ డిసీస్‌ ఇప్పుడు మళ్లీ తిరగబెట్టిందని, దాని ట్రీట్‌మెంట్‌ కోసమే ఆమె ఫారిన్‌కు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆమె నిన్నమొన్నటిదాకా యశోద సినిమా డబ్బింగ్‌ పనుల్లో తలమునకలై ఉంది. సోషల్‌ మీడియా డీటాక్స్ కోసమే ఆమె సైలెంట్‌గా ఉంది.

అసలు ఆమెకు ఆనారోగ్య సమస్యలు ఏమాత్రం లేవు అన్నది ఆమె తరఫు వాళ్లు చెబుతున్న మాట.ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంతకు ఉన్నపళాన డీటాక్స్ కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎలాంటి ట్రోల్స్ నైనా గట్టిగా ఎదుర్కొనే సమంత అసలు ఎందుకు ఇంత బేలగా మారిపోయింది? అనేది సోషల్‌ మీడియాలో జరుగుతున్న డిస్కషన్‌.ఒకవేళ బాలీవుడ్‌ ప్రాజెక్టుల కోసమే ఆమె టైమ్‌ తీసుకుంటుందని సర్దిచెప్పుకోవడానిక్కూడా వీల్లేదు.

సౌత్‌ నుంచి నార్త్ కి వెళ్తున్న ప్రాసెస్‌లో, చేస్తున్న ప్రతి పనినీ పబ్లిసిటీకి వాడుకోవడం మన హీరోయిన్లకు అలవాటు. ఆ లెక్కన సమంత డబుల్‌ స్పీడ్‌ కావాల్సిందే తప్ప, తగ్గే ప్రసక్తే లేదు.అలాంటప్పుడు ఇంకేమై ఉంటుంది? ఒకవేళ శాకుంతలం, యశోద సినిమాలను అక్టోబర్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేసుకున్నా, ఇప్పుడున్న పరిస్థితులు కంటిన్యూ అయితే సమంత వచ్చి పబ్లిసిటీ చేస్తుందా? ఆమె పబ్లిసిటీ లేకుండా సినిమాలు విడుదలైతే, ఓపెనింగ్స్ రాబట్టగలుగుతాయా? ఇలాంటి కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి జనాల మధ్య.

, , , , ,