మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లైనప్ చూస్తే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను డబుల్ చేసుకునేలా దూసుకుపోతున్నాడు. వరుసగా ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్స్ తో వెళుతున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన లో సినిమా చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అతను సివిల్ సర్వెంట్ గా కనిపించబోతున్నాడు. ఆ తర్వాత రీసెంట్ గానే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా ఓకే అయింది. అయితే ఈ కథ ఎన్టీఆర్ చేయాల్సింది. ఎన్టీఆర్ కు టైమ్ లేకపోవడంతో సుకుమార్ సాయంతో చరణ్‌ ను మెప్పించాడు బుచ్చిబాబు. ఇక జనవరిలోనే షూటింగ్ కు వెళుతుందనుకున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కొత్త వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబును చరణ్‌ కూడా హోల్డ్ లో పెడుతున్నాడు అంటున్నారు.


శంకర్ తర్వాత చరణ్‌ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉంది. బట్ కథ నచ్చక నో చెప్పాడు. తర్వాత కన్నడ దర్శకుడు నర్తన్ తోనూ ఓ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నర్తన్ మళ్లీ లైన్ లోకి వచ్చాడట. ఈ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ మూవీ ఉగ్రమ్ కు అతని వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. తర్వాత తను దర్శకుడై మఫ్టీ అనే సినిమా చేశాడు. శివరాజ్ కుమార్, శ్రీ మురళి హీరోలుగా నటించిన ఈ మూవీ అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ హిట్ తో పాటు ప్రశాంత్ నీల్ పరిచయంతో చరణ్‌ ను మెప్పించాడు అంటున్నారు.

ఎంతలా అంటే.. బుచ్చిబాబు చెప్పిన కథ కంటేఇదే అతన్ని ఎగ్జైట్ చేసిందట. దీంతో ముందు నర్తన్ తోనే సినిమా చేయాలని భావిస్తున్నాడు అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంత అనేది ఇంకా తెలియదు. బట్ ఈ గాసిప్ కూడా బుచ్చిబాబును భయపెడుతుందనే చెప్పాలి. తనకూ సుకుమార్ సపోర్ట్ ఉంది. కానీ స్టార్ హీరోల నిర్ణయాన్ని కాదనిపించే పని సుకుమార్ కూడా చేయడు కదా.. అందుకే అర్జెంట్ గా తన ప్రాజెక్ట్ న పట్టాలెక్కించాలనే ప్రయత్నాల్లో ఉన్నాడట బుచ్చిబాబు. మరి నిజంగానే చరణ్‌ ముందు నర్తన్ తోనే వెళ్లాలి అనుకుంటే బుచ్చిబాబు ఎంత ప్రయత్నించినా పెద్దగా ఉపయోగం ఉండదు కదా..?

, , , , , , , , , , , , , , , ,