Advertisement
రాధేశ్యామ్ మళ్లీ హ్యాండ్ ఇచ్చినట్టేనా..?
Latest Movies Tollywood

రాధేశ్యామ్ మళ్లీ హ్యాండ్ ఇచ్చినట్టేనా..?

Advertisement

రాధేశ్యామ్.. మన పురాణాల నుంచి తీసుకున్న పొయొటిక్ టైటిల్. పురాణాల్లో అత్యంత గొప్ప ప్రణయగాథల్లో రాధాకృష్ణుల గాథ ఒకటి. అందుకే చాలా వరకూ మంచి ప్రేమికులను చూసినప్పుడు కథలు విన్నప్పుడు వారిది రాధాకృష్ణులంత గొప్ప ప్రేమకథ అని చెబుతుంటాం. మరి అలాంటి టైటిల్ తో వస్తోన్న సినిమా అంటే కంటెంట్ ను కూడా ఆ రేంజ్ లోనే ఊహించుకున్నారు ప్రేక్షకులు. కాకపోతే ప్రభాస్ ఇమేజ్ కుభిన్నమైన కంటెంట్ అని కూడా ముందు నుంచీ ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశారు. అతని మాస్ ఇమేజ్ కు ఈ క్లాస్ సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేది పక్కన బెడితే.. ఈ సినిమా ఆరంభం నుంచి అన్నీ అరిష్టాలే ఎదుర్కొంటోంది. ముందు అనుకున్న కథ మొదట్లోనే మారింది. సాహో ఫ్లాప్ తర్వాత మరిన్ని మార్పులు చేశారు. ఇటు షూటింగ్ కూడా ఎప్పుడూ సజావుగా సాగలేదు. దీంతో అనుకున్న షెడ్యూల్స్ కంటే కూడా మూడు రెట్లు ఎక్కువ షెడ్యూల్స్ లో షూట్ చేశారు. ఈ మేరకు నిర్మాతలు వెనకాడకపోయినా.. ఓ వైపు ఇతర హీరోల సినిమాల అప్డేట్స్ తో రెచ్చిపోతోంటే ప్రభాస్ సినిమాగురించి ఏ అప్డేట్ లేదని ఫ్యాన్స్ ఏకంగా నిర్మాణ సంస్థపై సోషల్ మీడియాలో దాడి చేసినంత పనిచేశారు.
ఇక అంతా అయింది విడుదల గ్యారెంటీ అనుకున్న తర్వాతే ఇప్పటికి మూడు నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయిందీ చిత్రం. అలాగని అప్పటికే చాలా అప్డేట్స్ ఇచ్చారని కాదు.. ఏమీ ఇవ్వకపోయిన విడుదల చేస్తారు అనుకున్నారు. ఇక ఫైనల్ గా ఈ సంక్రాంతి బరిలో సత్తా చాటేందుకు సిద్ధమైంది రాధేశ్యామ్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఆ మధ్య బిగ్గెస్ట్ నేషనల్ ఈవెంట్ అంటూ రామోజీ ఫిల్మ్ సిటీలో ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేశారు. అయితే అది ఊహించినంత గొప్ప సక్సెస్ కాలేదు. పోనీ తర్వాతైనా కంటిన్యూస్ గా ఇంటర్వ్యూస్ అనో లేక మరోటనో రెగ్యులర్ గా ప్రేక్షకుల్లో ఉంటుందనుకుంటే ఆ ఈవెంట్ తర్వాత హీరోతో పాటు హీరోయిన్ కూడా పత్తా లేదు.
ఇక ఈ లోగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్ కాలేజెస్, మాల్స్ , థియేటర్స్ ను మూసేశారు. ఇటు కర్ణాటకతో పాటు మహరాష్ట్రలో కూడా నైట్ కర్ఫ్యూ అంటున్నారు. దీంతో రాధేశ్యామ్ సైలెంట్ అయిపోవడానికి కారణం ఇదే అంటున్నారు. అలాగే నిర్మాతలు కూడా తమ సినిమాను 2022లోనే విడుదల చేస్తాం అంటూ ఆ మధ్య కాస్త ఎటకారంగా అన్నారట. అంటే 2022 డిసెంబర్ వరకూ ఉంటుంది కదా.. సో.. దీన్ని బట్టి రాధేశ్యామ్ మరోసారి వాయిదా పడినట్టే అనే అంచనాకు వస్తున్నారు విశ్లేషకులు. లేదంటే.. ఆర్ఆర్ఆర్ హడావిడీ ముందు తాము ఏం చేసినా పట్టించుకోరు అనే భయం వల్ల ఏమైనా ఆగుతున్నారా అనేది కూడా చూడాలి. ఏదేమైనా ఇప్పటి వరకూ తెలుస్తున్నదాన్ని బట్టి.. రాధేశ్యామ్ సంక్రాంతి బరిలో నిలవడం 90శాతం కష్టమే అంటున్నారు. మరి ఇదే నిజమైతే.. ఫ్యాన్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ మధ్య వార్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకు కూడా అందదేమో..?

Advertisement