ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగల ప్రతిభావంతుడు. డ్యాన్స్ గురించి ఇంకా చెప్పేదేముందీ.. ఇండియాలోని టాప్ డ్యాన్సర్స్ లో తనూ ఒకడు. అయితే తెలుగులోని ఇతర టాప్ స్టార్స్ తో కంపేర్ చేస్తే కంట్రీ వైడ్ గా ఎన్టీఆర్ ఛరిష్మా ఇంకా తెలియలేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ తో పోల్చుకుంటే మిగిలిన మన స్టార్స్ అంతా అతని వెనకే ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ప్రభాస్ ను మినహాయించొచ్చు. అయితే అదంతా ఆయా స్టార్స్ టాలెంట్ మాత్రమే కాదు. ప్రమోషన్స్. యస్.. ఆయా భాషల్లో ఉన్న వారి పిఆర్ టీమ్ లు చేసే విన్యాసం. ఆ పిఆర్ తోనే సదరు స్టార్స్ కు ఇతర భాషల్లో క్రేజ్ ను పెంచుతుంటారు.
క్రేజ్ పెరుగుతందంటే అర్థం మార్కెట్ కూడా పెరుగుతున్నట్టే కదా.. ఈ విషయంలో అల్లు అర్జున్ అందరికంటే ముందున్నాడు. తన పీ ఆర్ టీమ్ లు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ఇంకా చెబితే ఈ ప్రమోషన్స్ కోసం అత్యంత ఎక్కువగా ఖర్చు చేసే స్టార్ కూడా బన్నీనే అంటే ఆశ్చర్యం కలగక మానదు. దాని ద్వారా అతనికి వచ్చిన ప్లస్ ఏంటీ అంటే రీసెంట్ గా వచ్చిన అల వైకుంఠపురములో అతని క్రేజ్ ను ప్యాన్ ఇండియన్ స్థాయిలో పరిచయం చేస్తే పుష్ప ప్యాన్ ఇండియన్ స్థాయిలో మార్కెట్ అయింది. అదో స్ట్రాటజీ. ఇలాంటి స్ట్రాటజీల విషయంలో ఇప్పటి వరకూ కాస్త వీక్ గా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అతని గురించి బాలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది. ఇటు తెలుగులోనూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించిన వార్తలు రెగ్యులర్ గా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇదంతా ఆయా స్టార్స్ చేయలేరు. వారి పీ ఆర్ టీమ్ లు సోషల్ మీడియా మేనేజ్మెంట్స్ చేస్తుంటాయి. అలా చేయడం వల్ల దేశవ్యాప్తంగా తొందరగా గుర్తింపు వస్తుంది.
అయితే ఎన్టీఆర్ కు నటన పరంగా కొట్టేవాడే లేడు అంటారు. ఆ విషయంలో ఇప్పటికే పేరున్నా.. క్రేజ్ కూడా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ ను గుర్తించి.. దానికోసం ఏం చేయాలో అది మొదలుపెట్టారు కాబట్టే.. ఇప్పుడు యంగ్ టైగర్ గురించి బాలీవుడ్ బిగ్గీస్ కూడా బాగా చెప్పుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ టైమ్ లో ఎన్టీఆర్ యాటిట్యూడ్ కూడా వారికి బాగా నచ్చింది. అతని ఇంటరాక్షన్, ఇన్సియేషన్ అన్నీ నార్త్ పీపుల్ ను బాగా ఆకట్టుకున్నాయి. దానికి ఇలాంటి మంచి పీఆర్ కూడా యాడ్ అయితే ఎన్టీవోడు ప్యాన్ ఇండియన్ స్టార్ గానూ తనదైన తిరుగులేని నటన చూపించే అవకాశం ఉంటుందన్నమాట. ఏదేమైనా అల్లు అర్జున్ రూట్ లో నిన్న రామ్ చరణ్.. ఇప్పుడు ఎన్టీఆర్ మొదలుపెట్టారు. మరి ఎవరు బాగా సక్సస్ అవుతారో చూడాలి.

, , , , , , , , , , ,