ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’  చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ ‘సార్’ కు సమర్పకునిగా వ్యవహరిస్తోంది. ‘సార్’ ధనుష్ తో సంయుక్త మీనన్ జోడీ కడుతున్నారు.

వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో  నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు) ‌’వాతి’,(తమిళం) షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 2 న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు ఉదయం ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు.

కథానాయకుడు ధనుష్ క్లాస్ రూం లో స్టూడెంట్స్ ముందు టేబుల్ మీద కూర్చొని బ్లాక్ బోర్డు మీద గణితం సబ్జెక్ట్ కు సంభందించిన అంశాలను చూపిస్తూ ఉండటం కనిపించే చిత్రం ఆకట్టుకుంటోంది.విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు ‘సార్’ జీవితాన్ని  ఏ తీరానికి చేర్చాయన్న ది అటు ఆసక్తి ని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో  ‘సార్’ డిసెంబర్ 2 న  విడుదలకానుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు.

, , , , , , , , , , , ,