కొన్ని కాంబినేషన్స్ అన్ని భాషల ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఆకర్షిస్తాయి. అలాంటిదే ఆ మధ్య అనౌన్స్ అయిన ధనుష్‌ – శేఖర్ కమ్ముల కాంబినేషన్. శేఖర్ సెన్సిబుల్ మూవీస్ తో టాలీవుడ్ లో తనకంటూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ధనుష్ ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హైలీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. బెస్ట్ యాక్టర్ గా ఇప్పటికే రెండు నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి అతని ఖాతాలో.

అలాంటి ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే సడెన్ గా ఆ మేటర్ పక్కన బెట్టి ధనుష్.. సితార బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ అనే సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ మూవీ షూటింగ్ పూర్తవుతున్నా..

ఈ మూవీ గురించిన వార్తలేవీ వినిపించలేదు. దీంతో ఓ దశలో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే టాక్స్ కూడా వచ్చాయి. బట్ సడెన్ గా అందరికీ షాక్ ఇస్తూ ఈ సోమవారం ఈ చిత్రం అఫీషియల్ గా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నారాయణదాస్ నారంగ్, ఏసియన్ సునిల్, పుష్కర్ రామ్మోహన్ నిర్మిస్తోన్న చిత్రం కావడంతో బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని టాక్.


ఇక ఈ చిత్ర కథ గురించి కూడా రకరకాల వార్తలు వచ్చాయి. కొందరు పీరియాడిక్ అన్నారు. మరికొందరు తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ఉంటుందన్నారు. ఇంకొందరేమో.. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ప్రయత్నించిన ఓ యోధుడి కథను ఫిక్షనల్ గా తెరకెక్కిస్తున్నారు అని చెప్పారు. అవన్నీ ఎలా ఉన్నా.. శేఖర్ కమ్ముల స్పీడ్ కు, ధనుష్ దూకుడు మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ను ఫిల్ చేస్తూ శేఖర్ కమ్ముల కాస్త స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇన్నాళ్లూ అసలు ఉందా లేదా అనిపించిన కాంబినేషన్ నుంచి అనూహ్యంగా ఓపెనింగ్ తో కూడిన అప్డేట్ రావడం విశేషమే.

, , , , , , , , , ,