స్టార్‌ హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్‌ చేస్తారు. కాస్త స్పీడు మీదుంటే రెండు సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతకు ముందు ఏడాది రిలీజుల్లో వాయిదాల పర్వం నడిచుంటే మూడు. అంతకు మించి నాలుగో సినిమా కోసం ఆడియన్స్ కూడా ఆశపడరు. మీరు కోరుకోకపోతేనేం, నేను ఇస్తూనే ఉంటా అనే ధోరణి ప్రదర్శిస్తున్నారు ధనుష్‌. బ్యాక్‌ టు బ్యాక్‌ తన ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.ఆల్రెడీ ఈ ఏడాది మారన్‌, ది గ్రే మేన్‌, తిరుచిత్రంబలం సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. మారన్‌ కాస్త అటూ ఇటూ అయినా, ది గ్రేన్‌ మేన్‌ మాత్రం ధనుష్‌ కి ఇంటర్నేషనల్‌ డయాస్‌ మీద మంచి ఫేమ్‌ తెచ్చిపెట్టింది.

ఆ సినిమా ప్రమోషన్లకు పంచెకట్టుతో వెళ్లి అట్రాక్ట్ చేశారు ధనుష్‌.రీసెంట్‌గా రిలీజ్‌ అయిన తిరుచిత్రంబలం సినిమాకు సర్వత్రా మంచి ఆదరణ దక్కింది. ముగ్గురు హీరోయిన్లున్నా, ధనుష్‌, నిత్యామేనన్‌ మధ్య కెమిస్ట్రీ గురించి ఇప్పటికీ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు యూత్‌. ధనుష్‌ బెస్ట్ స్క్రిప్ట్‌లు సెలక్ట్ చేసుకుంటున్నారనే పేరును మరోసారి కన్‌ఫర్మ్ చేసిన సినిమా తిరుచిత్రంబలం. తెలుగులో తిరు పేరుతో రిలీజైంది.ఈ నెల్లోనే అంటే, సెప్టెంబర్‌ 29న నానే వరువేన్‌ రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్ చేశారు నిర్మాతలు. ధనుష్‌ హీరోగా ఆయన సోదరుడు సెల్వరాఘవన్‌ తెరకెక్కించిన సినిమా నానే వరువేన్‌.

ధనుష్‌ ప్లస్‌ సెల్వ కాంబోకి కోలీవుడ్‌లో సూపర్‌ క్రేజ్‌ ఉంది. ఈ సినిమాలో అన్నాదమ్ములు ఇద్దరూ కలిసి స్క్రీన్‌ మీద కనిపిస్తారు. రిలీజ్‌కి ముందే మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది నానే వరువేన్‌.ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఇయర్‌ ఎండింగ్‌ ధమాకాను కూడా ప్లాన్‌ చేసేశారు ధనుష్‌. ఆయన చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్‌ సినిమా సర్‌. ఈ సినిమాను తమిళ్‌లో వాత్తి పేరుతోనూ రిలీజ్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 2న సర్‌ని రిలీజ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యారు మేకర్స్. వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్న సినిమా సర్‌. సంయుక్తమీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఈ ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ ఐదు సినిమాలను రిలీజ్‌ చేసిన క్రెడిట్‌ని సొంతం చేసుకుంటారు ధనుష్‌.

, , , , , , ,