పాత సినిమాల‌ను కొత్త‌గా రిలీజ్ చేయ‌డం అనే ట్రెండ్ ను టాలీవుడ్ మేక‌ర్స్ మొద‌లుపెట్టారు. మహేష్ బాబు ఓల్డ్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ ను నేటి టెక్నాల‌జీకి అనుగుణంగా అప్డేట్ చేసి అత‌ని బ‌ర్త్ డే రోజైన ఆగ‌స్ట్ 9న అనేక థియేట‌ర్స్ లో ప్ర‌ద‌ర్శించారు. ముఖ్యంగా ఈ ప‌ని చేసింది ఫ్యాన్స్. మ‌రి మ‌హేష్ ఫ్యాన్స్ చేస్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు మాత్రం ఊరుకుంటారా..? వీరూ మొద‌లుపెట్టారు. జ‌ల్సా నుంచి ఖుషీ, త‌మ్ముడు వ‌ర‌కూ 4కే టెక్నాల‌జీకి అప్డేట్ చేసి మ‌రీ థియేట‌ర్స్ లో వేశారు. ఇలా క‌లెక్ట్ అయిన ఫండ్స్ ను సోష‌ల్ స‌ర్వీస్ కు ఉప‌యోగిస్తామ‌ని ఇద్ద‌రు హీరోల ఫ్యాన్స్ ముందే చెప్పేశారు. కొన్ని చోట్ల అభిమానుల అత్యుత్సాహంతో కొన్ని థియేట‌ర్స్ ధ్వంసం అయ్యాయి.. అది వేరే సంగ‌తి. ఇక ఈ ట్రెండ్ ఇప్పుడు కోలీవుడ్ కూ వెళ్లిన‌ట్టుంది.

ప్ర‌స్తుతం గ్లోబ‌ల్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతోన్న ధ‌నుష్ న‌టించిన 3 అనే చిత్రాన్ని మ‌ళ్లీ రిలీజ్ చేయ‌బోతున్నారు. శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రం 3. అడోలెసెంట్ నుంచి టీనేజ్ వ‌ర‌కూ సాగే ప్రేమ‌క‌థ‌గా వ‌చ్చిన ఈ మూవీ అప్ప‌ట్లో హార్ట్ మెల్టింగ్ అనిపించుకుంది. బ‌ట్ నిర్మాత‌కు లాస్ లు తెచ్చింది. య‌స్.. విమ‌ర్శియ‌ల్ గా అద్భుతం అనిపించుకున్న ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ గా లాస్ అయింది.
2012 మార్చి 30న విడుద‌లైన ఈ చిత్రానికి ధనుష్ భార్య ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కురాలు కావ‌డం విశేషం. 3 చిత్రానికి మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు సైమా అవార్డ్స్ వ‌చ్చాయి.

ఇలాంటి సినిమాను ఈ నెల 8న కొత్త టెక్నాల‌జీకి అనుగుణంగా అప్డేట్ చేసి రిలీజ్ చేయ‌బోతున్నారు. మ‌రి ధ‌నుష్ లాంటి హీరో సినిమా వ‌స్తే.. విజ‌య్, అజిత్, వంటి స్టార్స్ అభిమానులు ఆగుతారా.. ఇంక వాళ్లూ మొద‌లుపెడ‌తార‌నే చెప్పాలి. ఏదేమైనా ఇలాంటి సినిమాల‌ను మెమ‌రీస్ గా చూస్తే బావుంటుంది కానీ.. వెర్రి అభిమానంతో చూస్తే ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో జ‌రిగిన‌ట్టుగా థియేట‌ర్స్ ధ్వంసం జ‌రుగుతుంది.

, , , , ,