నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ. యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 2న అఖండ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇంకా చెప్పాలంటే.. అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని అన్ని చోట్ల కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది.
సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన భారీ చిత్రం ఇది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా గట్టిగానే కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అయితే.. ఒక్క అమెరికాలోనే 6.68 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం. ఆస్ట్రేలియాలో 1.26 కోట్లు, యు.కెలో 72 లక్షలు, యూరప్ లో 15 లక్షలు, గల్ఫ్ లో 80 లక్షలు, కెనడాలో 25 లక్షలు, సింగపూర్ లో 13 లక్షలు, మలేషియాలో 4 లక్షలు, యూరప్ లో 15 లక్షలు ఇలా… ఓవర్సీస్లో అఖండ చిత్రం ఫస్ట్ వీక్ మొత్తంగా 10.08 కోట్ల గ్రాస్‌ని సాధించింది.
దీంతో అఖండ ఓవర్సీస్లో 2021లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగానే కాకుండా, హైయ్యెస్ట్ గ్రాస్‌ని సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా అఖండ మాస్ జాతర మారు మోగిందనే చెప్పుకోవాలి. దీంతో ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది.