Advertisement
PRABHAS,NTR :- ప్ర‌భాస్, ఎన్టీఆర్, బ‌న్నీ గురించి దీపికా కామెంట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..
Latest Movies Tollywood

PRABHAS,NTR :- ప్ర‌భాస్, ఎన్టీఆర్, బ‌న్నీ గురించి దీపికా కామెంట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..

Advertisement

యాంక‌ర్ – బాహుబ‌లి సినిమాతో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డంతో.. బాలీవుడ్ మొత్తం మ‌న టాలీవుడ్ వైపు చూస్తోంది. ఇంకా చెప్పాలంటే.. హాలీవుడ్ కూడా టాలీవుడ్ వైపు చూస్తుంది. బాలీవుడ్ మూవీ డైరెక్టర్లు, ప్రొడ్యూస‌ర్స్ దగ్గర నుంచి హీరో,. హీరోయిన్ల వరకు అంతా టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో నటించడానికి మొగ్గు చూపుతున్నారు.

ఆమ‌ధ్య అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ క‌పూర్.. టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించాలి అనుకుంటున్నాను అని ఓ ఇంట‌ర్ వ్యూలో చెప్పింది. ఇప్పుడు జాన్వీ క‌ఫూర్.. విజ‌య్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది. అవును.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న‌. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న జాన్వీక‌పూర్ న‌టిస్తుంది. మొన్నటికి మొన్న అలియా భట్, తారక్ తో నటించడం ఇష్టమని చెప్పడమే కాకుండా ఆ ఛాన్స్ కూడా పట్టేసింది. ఇక తాజాగా దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ హీరోల పై మనసు పారేసుకుంది.

ఇప్పటికే ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కె లో నటిస్తుంది ఈ అమ్మడు. ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉందని త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌టపెట్టింది. తాజాగా దీపికా నటించిన‌ గెహ్రైయాన్ సినిమా అమెజాన్ లో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా జరిగిన ఒక ఇంటర్ వ్యూలో ఇప్పటి వరకు మీరు నటించిన వారు కాకుండా.. నటించని ఇండియన్ స్టార్స్ లో ఎవరితో మీరు నటించాలని అనుకుంటున్నారు అన్న‌ ప్రశ్నకు ఠ‌క్కున దీపికా.. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల‌తో నటించాలని ఉంది అని చెప్పి షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ‌రి.. ఈ బాలీవుడ్ బ్యూటీ త్వ‌ర‌లోనే ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల‌తో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంటుందేమో చూడాలి.

Advertisement