ధమ్కీ.. మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న సినిమా. ఈ చిత్రానికి తనే దర్శకుడు, నిర్మాత కూడా. ఇంతకు ముందు తనతో పాగల్ సినిమాలో రొమాన్స్ చేసిన నివేదా పేతురాజ్ హీరోయిన్. ఫస్ట్ టైమ్ డ్యూయొల్ రోల్‌ చేసినట్టుగా లేటెస్ట్ గా బాలయ్య చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అయితే చాలా వరకూ ట్రైలర్ రాగానే మూవీస్ పై ఓ అంచనా వస్తుంది. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకునేలానే “కట్” చేసినా.. కంటెంట్ మాత్రం చాలా చాలా పాతదిగా కనిపిస్తోందనే కమెంట్స్ వస్తున్నాయి. నిజానికి ట్రైలర్ కే ఈ టాక్ రావడం అంటే ఇవాళా రేపూ కాస్త ఇబ్బందే.


ధమ్కీ ట్రైలర్ ఒన్ పాయింట్ ఓ అంటూ రావడం బానే ఉంది. కంటెంట్ చూస్తే.. ఆ మధ్య వచ్చిన గోపీచంద్ గౌతమ్ నందా ఛాయలు కనిపిస్తున్నాయి. అలాగే డ్యూయొల్ రోల్ అనగానే సినిమా పుట్టిన దగ్గర్నుంచీ కనిపిస్తోన్న “వాడి ప్లేస్ లోకి వీడు.. వీడి ప్లేస్ లోకి వాడు” అన్న ఫార్మాటే కనిపిస్తోంది. దీనికి సెంటిమెంట్ అదనం. గౌతమ్ నందాను గుర్తుకు తెస్తూ.. ఆ పాత ఫార్ములాలోనే సాగే సినిమాలా కనిపిస్తోంది ధమ్కీ.


విశ్వక్ సేన్ రీసెంట్ గా యాక్షన్ కింగ్ అర్జున్ సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకోవడం.. అందుకు అర్జున్ ఘాటుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ నిందించడం చూశాం. దాన్ని కవర్ చేసుకోవడానికి కౌంటర్ ఇచ్చాడు విశ్వక్. కానీ ఓ డామేజ్ అయితే జరిగింది. ఆ డామేజ్ ను వీలైనంత త్వరగా రిపేర్ చేసుకోవడానికి హడావిడీగా ఈ ట్రైలర్ కట్ చేశారా అనుకునేవారూ ఉన్నారు.

కానీ ట్రైలర్ ఎలా కట్ చేసినా కంటెంట్ ను మాత్రం ఏం చేయలేరు కదా..? సో.. అశోకవనంలో అర్జున కళ్యాణంతో మంచి పేరు తెచ్చుకుని మళ్లీ రీసెంట్ గా ఓరి దేవుడాతో మరో ఫ్లాప్ చూసిన విశ్వక్ సేన్ కు ఈ మూవీ హిట్ కావడం అత్యవసరం. బట్ ఈ కంటెంట్ చూస్తే కిచిడీ కథలా కనిపిస్తోంది. అయినా ఎంటర్టైన్ చేయగలిగితేనే.. విజయం. లేదంటే.. మరోటి తప్పదు.

, , ,