క‌రోనా మ‌హ‌మ్మారి రెండేళ్ల పాటు అంద‌ర్నీ టెన్ష‌న్ పెట్టింది. చాలా మంది జీవితాల‌ను తారుమారు చేసేసింది. 2020, 2021 ఈ రెండు సంవ‌త్స‌రాల‌ను ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. ఎంతో మందిని తీసుకెళ్లిపోయింది.. ఎన్నో జీవిత పాఠాల‌ను నేర్పించింది.
కనీసం 2022లో అయినా కోవిడ్ అంతమవుతుంది అనుకుంటే.. ఇప్పుడు ఓమిక్రాన్ అంటూ కొత్త వేరియెంట్ మ‌రింత‌గా టెన్ష‌న్ పెడుతుంది. దీంతో జనం మరోసారి అలెర్టయ్యారు. ప్రభుత్వాలు నిబంధనల్ని కఠినతరం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు మ‌రోసారి సెల‌బ్రిటీల‌ను కూడా క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. అమితాబ్ కుటుంబం.. మెగా కుటుంబం.. కపూర్ కుటుంబం .. ఘట్టమనేని కుటుంబం ఇలా అన్ని కుటుంబాల్లోనూ కోవిడ్ కేసులు కనిపిస్తున్నాయి. ఇటీవల కమల్ హాసన్ కి కోవిడ్ సోకింది. నిన్న రాత్రి మ‌హేష్ త‌న‌కి కోవిడ్ సోకింద‌ని ట్వీట్ చేశారు. అలాగే మంచు మ‌నోజ్, విశ్వ‌క్ సేన్ కరోనా బారిన‌ప‌డ్డారు. తాజాగా మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మికి కూడా కరోనా పాజిటివ్ అని తెలిసింది.

మంచు ల‌క్ష్మి తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. రెండేళ్లుగా వైరస్ నుండి దాగుడు మూతలు ఆడుతున్నాం. చివరకు దానికి చిక్కాను అని లక్ష్మి మంచు ప్రకటించారు. వైరస్ తో పోరాడటానికి అవసరమైన జాగ్రత్తల గురించి లక్ష్మీ ఇలా రాసుకొచ్చారు. ఇలా వ‌రుస‌గా సినీ ప్ర‌ముఖులు కరోనా బారిన‌ప‌డ‌డంతో టాలీవుడ్ లో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , ,