Advertisement
నాగ‌చైత‌న్య, అఖిల్ మ‌ధ్య పోటీ. గెలిచేది ఎవ‌రు.?
Latest Movies Tollywood

నాగ‌చైత‌న్య, అఖిల్ మ‌ధ్య పోటీ. గెలిచేది ఎవ‌రు.?

Advertisement

యూత్ కింగ్ అక్కినేని అఖిల్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం ఏజెంట్. ఈ భారీ యాక్ష‌న్ మూవీకి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనిల్ సుంక‌ర‌, సురేంద‌ర్ రెడ్డి, రామ‌బ్ర‌హ్మం సుంక‌ర సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని ఆతృత‌గా ఎదురు చూస్తున్న ఏజెంట్ మూవీ ఆగ‌ష్టు 12న చేయ‌నున్న‌ట్టుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే.. ఆగస్ట్ 11వ తేదీ లాల్ సింగ్ చద్దా మూవీ విడుదల కాబోతోంది.

బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన‌ ఈ సినిమాతో తొలిసారి అక్కినేని నాగచైతన్య బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో నాగ‌చైత‌న్య‌ కీలక పాత్ర పోషించాడు. అమీర్ ఖాన్, నాగ‌చైత‌న్య పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ని అంటున్నారు. అంతే కాకుండా.. ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయాలని ఆమీర్ ఖాన్ భావించారు. అదే జరిగితే… ఆగస్ట్ 12న అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ దానికి ముందు రోజు విడుదలయ్యే నాగచైతన్య లాల్ సింగ్ చద్దా తో పోటీ పడబోతుండ‌డం విశేషం.

అయితే… అక్కినేని అభిమానులు కాస్తంత టెన్షన్ ఫీల‌వుతున్నారు. కొందరైతే.. ఈ రెండు సినిమాల్లో ఏదొక‌టి వాయిదా పడుతుందేమో అంటున్నారు. ఇక ఏజెంట్ మూవీ విషయానికి వస్తే.. దీని కోసం అఖిల్ ప్రత్యేకంగా మేకోవర్ చేశాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. హిప్ హాప్ తమిళ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మ‌రి.. ఒక్క రోజు గ్యాప్ లో నాగ‌చైత‌న్య‌, అఖిల్ పోటీప‌డ‌తారో… లేక ఎవ‌రో ఒక‌రు త‌మ చిత్రాన్ని వాయిదా వేస్తారో..? ఒక‌వేళ ఇద్ద‌రు పోటీప‌డితే ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో చూడాలి.

Advertisement