గతంలో ఓటీటీలో మహాన్ సినిమా ద్వారా మన ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్ ఈరోజు వినాయకచవితి నాడు కోబ్రాగా వచ్చాడు థియేటర్లోకి.. డిమౌంట్ కాలనీ, అంజలి సిబిఐ సినిమాల దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం,విక్రమ్ మల్టిపుల్ గెటప్స్లో కనిపించటం.. కేజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అవడం వీటికి తోడు ఏఆర్ రెహమాన్ సంగీతం అనగానే ప్రేక్షకుల అంచనాలు మామూలుగా ఉండవు.


యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ కోబ్రా మూవీ కొన్ని చోట్ల మాత్రమే మనల్ని ఆకట్టుకుంటుంది. సస్పెన్స్ క్రైమ్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని ఫ్రెష్ సీన్స్ కూడా బాగున్నాయి. చాలా సీన్స్ కన్ ఫ్యూజ్డ్ గా సాగడం, స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అవ్వడం(ముఖ్యంగా సెకండాఫ్లో), లాజిక్కులకు దూరంగా ఉండటం అలాగే కొన్ని సీన్స్ లో ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్. మరీ ముఖ్యంగా కోబ్రా ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు ఆడియెన్స్‌ను బాగా ఎంగేజ్ చేస్తాయి.సినిమాలో విక్రమ్ నటన అద్భుతంగా ఉంది. కొన్ని ఎమోషన్స్ సీన్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా ఈ చిత్రం విక్రమ్ ఫ్యాన్స్ కి మాత్రం నిజంగా పండగే.. అయితే, మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా ఎంతవరకూ ఆకట్టుకుంటుందనేది చూడాలి.

ఈ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్గా ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటించటం సినిమాకు మరింత గ్లామర్ తీసుకొచ్చింది .. విక్రమ్ నటన తర్వాత ఈ సినిమాకు బాగా ప్లస్ పాయింట్ ఏఆర్ రెహమాన్ సంగీతం.. నేపథ్య సంగీతం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంది. ఈ సినిమా వరకూ రెహమాన్ సౌండింగ్‌ మాత్రం అత్యద్భుతం.. ఎమోషనల్ సీన్స్‌లో నేటివిటీ ఫీలింగ్ ఉండేలా చూసుకున్నారు.దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు అందరికీ అర్థం అయ్యేలా, అదే విధంగా ఆకట్టుకునేలా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.. సెకండ్ హాఫ్ లో వచ్చే ఇల్యూజినేషన్ సీన్లు కొంత చిరాకు తెప్పించి ప్రేక్షకులను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తాయి ..ఒక గణిత మేధావి తన తెలివితేటలతో క్రైమ్ చేయడం అనే పాయింట్ కొత్తగా ఉంది.

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ కూడా బాగానే ఉంది. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం మరీ బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రధమార్ధంలో హత్యలను వివరించడానికి గణిత సిద్ధాంతాలను ఉపయోగించుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో చెప్పాలనుకున్నది క్రిస్పీగా చెప్పలేకపోయాడు.. దీనికి తోడు సినిమా రన్ టైం కూడా బాగా ఎక్కువ.. అది కూడా పెద్ద మైనస్.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులు ఒకసారి చూడొచ్చు..చివరగా సెకండ్ హాఫ్ కి సరిగ్గా కత్తెర పడితే సూపర్ సినిమా అయ్యేది కోబ్రా..

, ,