Advertisement
భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిందా..?
Latest Movies Tollywood

భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చిందా..?

Advertisement

పవర్ స్టార్ భీమ్లా నాయక్ చిత్రాన్ని ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న… ఈ రెండు తేదీల్లో ఒక రోజున విడుదల చేస్తామని ఈ మధ్యే ప్రకటించారు నిర్మాత నాగవంశీ. భారీ అంచనాలున్న భీమ్లా నాయక్ కోసం పవన్ ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఫస్ట్ కాపీ రెడీ చేసేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలను బట్టి బీమ్లా నాయక్ ఈ నెల 25నే రిలీజ్ కాబోతుందా..?
భీమ్లా నాయక్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు…కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ కోవిడ్ నిబంధనల కారణంగా భీమ్లా నాయక్ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడే కోవిడ్ థర్డ్ వేవ్ కంట్రోల్ అవుతున్న నేపథ్యంలో ఓ వారం క్రితం టాలీవుడ్ మేకర్స్ అంతా తమ తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని ప్రకటించారు. అందులో భాగంగా భీమ్లా నాయక్ కి రెండు రిలీజ్ డేట్స్ ని ఆప్షన్ గా పెట్టుకున్నారు. అందులో ఫిబ్రవరి 25 ఒకటి. ఏప్రిల్ 1 మరో డేట్.
ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న వార్తలను బట్టి భారీ అంచనాలున్న భీమ్లా నాయక్ ఈ నెల 25నే విడుదలకాబోతుంది. మేకర్స్ ఫస్ట్ కాపీ రెడీ చేసేస్తున్నారు. నిర్మాత నాగవంశీ రీసెంట్ గా డిజె టిల్లు ఈవెంట్ లో ఆంధ్రాలో ఎప్పుడు కోవిడ్ నిబంధనలు తీసేస్తారో అప్పుడే భీమ్లా నాయక్ విడుదలవుతుంది అన్నారు. ఈ నెల 14కి ఆంధ్రాలో నైట్ కర్ఫ్యూతో పాటు కోవిడ్ నిబంధనల గడువు పూర్తవుతుంది. వాటిని పొడిగించకపోతే భీమ్లా నాయక్ ఈ నెల 25నే విడుదలవుతుంది. కంటిన్యూ చేస్తే ఏప్రిల్ 1కి షిఫ్ట్ అవుతుంది. మొత్తంగా సిచ్యువేషన్స్ చూస్తే భీమ్లా నాయక్ ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తోంది.

Advertisement