శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు, నిర్మాత రమేష్ బాబు భౌతిక కాయానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. పద్మాలయ స్టూడియోస్ లో ఉంచిన రమేష్ బాబు పార్థివ దేహానికి సందర్శించిన పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు శ్రద్ధాంజలి ఘటించారు. నటుడు కోట శ్రీనివాసరావు, దర్శకుడు కొరటాల శివ, మెహర్ రమేష్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రవి శంకర్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

 

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియా వేదికగా పలువురు చిత్రరంగ ప్రముఖులు రమేష్ బాబు మృతి పట్ల సంతాపాలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, వరుణ్ తేజ్ తదితరులు ట్విట్టర్ ద్వారా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,