మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఓ రేంజ్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఏజ్ ను దాటి మరీ సైరా వంటి సినిమాలు సాహసవంతంగా పూర్తి చేశాడు. రిజల్ట్ తో పనిలేకుండా ఆచార్య లాంటి ప్రయోగాలూ చేస్తున్నాడు. దీంతో పాటు చేతినిండా సినిమాలు ఉంచుకుంటూ కొత్త దర్శకులూ ఆఫర్స్ ఇస్తున్నాడు. ఇలా ఇవ్వడం నిజంగా కొత్తగానే ఉంది. ఒకప్పుడు చిరంజీవిని కలిసి కథ చెప్పాలంటే ఒక్కో దర్శకుడికి(ముఖ్యంగా కొత్తవారికి) రెండు మూడేళ్లు పట్టేది. కానీ ఇప్పుడు ఆయనే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనో, ట్రైలర్ లాంచ్ చేస్తున్నప్పుడో ఆయా దర్శకులను తనే అడుగుతున్నాడు. మంచి కథ ఉంటే తీసుకురండి సినిమా చేద్దాం అంటున్నాడు. అయితే ఆయన హామీలు మాత్రమే ఇస్తున్నాడు. వాటిని ఆయన నిలబెట్టుకోవాలంటే ఆ హామీ తీసుకున్నవారిదే బాధ్యత.

ఆ బాధ్యత సక్రమంగా లేకపోతే ఇదుగో ఇలా వెంకీ కుడుములలా అవుతుంది పరిస్థితి. తెలుగులో ఛలో, భీష్మ సినిమాలతో విజయాలు అందుకుని గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ పంచడంలో వెంకీ స్టైల్ కొత్తగా కనిపించింది. రైటింగ్ లోనూ బలం ఉందన్నారు. అలాంటి దర్శకుడికి చిరంజీవే కొన్నాళ్ల క్రితం సినిమా చేద్దాం అని ఆఫర్ ఇచ్చాడు. ఏ దర్శకుడికైనా ఇది డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది. ఈ విషయంలో ఎంతో హ్యాపీగా ఫీలైన వెంకీ.. చిరు కోసం కథ సిద్ధం చేశాడు. కానీ ఆ కథ మెగాస్టార్ కు నచ్చలేదు. యస్..

వెంకీ కుడుముల తన కథతో చిరంజీవిని మెప్పించలేకపోయాడు. దీంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. అంతేకాదు.. ఈ కథ కోసమే తన టైమ్ అంతా వెచ్చించిన దర్శకుడు ఇప్పుడు మరో హీరోను వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మరో కొత్త రాసుకోవాలి. ఎందుకంటే ఎంతైనా చిరంజీవి కోసం అనుకున్న కథ మరో హీరోకు సెట్ కావడం దాదాపు అసాధ్యం.సో.. వెంకీ కుడుముల అనే కాదు.. చిరంజీవితో సినిమా చేయాలనుకున్న, చేయబోతోన్న ఏ దర్శకుడైనా.. అది ఫిక్స్ అని ఫీలవ్వొద్దు. ముందు తమ కథలతో ఆయన్ని మెప్పించాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. లేదూ మెగాస్టార్ హామీ ఇచ్చాడు కాబట్టి ఇంక అయిపోతుందిలే అనుకోవడానికి లేదు అనేందుకు వెంకీ కుడుముల ఉదంతం ఓ ఉదాహరణ.

, , , , , ,