ad

ఆకాశానికి సెంద్రుడెంత అందమో.. సినిమాకు వీరోయిన్ను అంత అంతం. ఆమె పాత్ర ఎలా ఉన్నా.. వెండితెర కాస్త కలర్ ఫుల్ గా కనిపించేందుకు ఉపయోగించేది తననే. మరి అలాంటి బ్యూటీ లేకుండానే సినిమా వచ్చేస్తే.. అది కూడా ఆరున్నర పదుల వయసులో కూడా అమ్మడూ కుమ్ముడూ, శానా కష్టం వచ్చిందే పిల్లా అంటూ చిందులు వేస్తోన్న చిరంజీవి లాంటి వారికి అంటే కాస్త ఆశ్చర్యమే కదా.. ఆ ఆశ్చర్యంలో మనం ఉండగానే అంత పనీ చేశారు ఆచార్య మేకర్స్. యస్.. ఆచార్య సినిమాలో కాజల్ పాత్రను పూర్తిగా తొలగించారు అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తను ఉన్న లాహేలాహే పాట మాత్రం ఉండే అవకాశం ఉందంటున్నారు. లేదంటే ఆ పాట లేకపోతే.. ఆడియన్స్ డిజప్పాయింటింగ్ అయిపోతారు కదా.. ఒకవేళ కాజల్ అసలుకే వద్దు అనుకుంటే ఆ పాటలోనే మళ్లీ రిపేర్లు అవసరం ఉంటాయి. మరి మెగాస్టార్ తో ఖైదీ నెంబర్ 150లో కలర్ ఫుల్ గా చిందులేసిన కాజల్ ను ఎందుకు వద్దనుకుంటున్నారో ఊహించారు కదా..?

కాజల్ సినిమాలకు కామా పెట్టింది. ఆచార్యకు ముందే పెళ్లి చేసుకున్న తను భర్తతో కలిసి వచ్చి మరీ ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొంది. ఆ సెట్స్ లో మెగాస్టార్ ఈ దంపతులకు సన్మానం కూడా చేశారు. కానీ ఇప్పుడు తను తల్లి అయింది. రీసెంట్ గా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ టైమ్ లో తనను సినిమాలో ఎలాంటి పాత్రలో చూపించినా ఎందుకు అనుకున్నారో లేక.. తనది నిజంగానే కథలో అవసరం లేకపోయినా ఇబ్బంది లేదు అనిపించే పాత్ర అనుకున్నారో కానీ.. ఆమె పాత్రకు పూర్తిగా కోత పెట్టారని టాలీవుడ్ కోడై కూస్తోంది. మరి ఈ కూతలో నిజమెంత అనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది కానీ.. అటు పూజాహెగ్డే, రామ్ చరణ్ పాత్రా చిన్నదే. ఇటు కాజల్ క్యారెక్టర్ ను కూడా లేపేస్తే.. మిగతా భారమంతా మెగాస్టార్ మోయగలడా అనేదే డౌటనుమానం.

, , , , ,