ad

డార్లింగ్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ గురించి రోజూ ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ చిత్రం మొదలైన కొన్నాళ్ల తర్వాత నుంచి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ ఎలా ఉన్నా.. నిజంగానే ఈ కథలో ముందు అనుకున్న దానికంటే తర్వాత చాలా మార్పులు చేశారనేది నిజం. అది కూడా సాహో రిజల్ట్ చూసిన తర్వాత. సాహో యావరేజ్ అనిపించుకోవడంతో .. ఈమూవీ కూడా పోతే ప్రభాస్ ప్యాన్ ఇండియన్ మార్కెట్ మైనస్ అవుతుందనే భయంతో అప్పుడు మార్చారు. ఆ మార్పు మంచిదే. కానీ ఆలోగా కరోనా వచ్చింది. దీంతో అనుకున్న దానికంటే సినిమా బాగా ఆలస్యం అయింది. మరోవైపు ఫ్యాన్స్ నుంచి ఏదో ఒక అప్డేట్ కావాలనే ఒత్తిడి నుంచి తట్టుకుని ఫైనల్ గా సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు.
అయితే ఏ మాటకామాట.. ఈ మూవీపై ఒక దశలో పూర్తిగా హోప్స్ వదిలేసుకున్నారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఏమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయారు మేకర్స్. బట్.. ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు మారాయి. ఇందులో ఏదో బలమైన కంటెంట్ ఉన్నట్టే అనిపించింది. ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటించిన రాధేశ్యామ్ 1960ల నేపథ్యంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఆ కాలపు యాంబియన్స్ అంతా ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది. అటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని సమద్రంలో షిప్ కు సంబంధించిన షాట్స్ చూస్తే తెలుస్తుది. ముఖ్యంగా నిజంగానే వాళ్లు చెబుతున్నట్టుగా ఓ అద్బుతమైన ప్రేమకథా చిత్రంమే అనే భావన ట్రైలర్ తెచ్చింది.
ఇక సంక్రాంతి నుంచి సినిమా పోస్ట్ పోన్ అయింది. అప్పుడెవరూ పెద్దగా ఫీలవలేదు. అయితే ఆ తర్వాత మళ్లీ కొత్త పుకార్లు మొదలయ్యాయి. రాధేశ్యామ్ ను భారీ డీల్ కు ఒక ఓటిటి సంస్థకు ఇచ్చేశారని.. ఇక థియేటర్స్ లో చూడ్డం కుదరదనేది ఆ రూమర్ సారాంశం. వీటిని మొదట్లో నిర్మాణ సంస్థ సీరియస్ గా తీసుకోలేదు. ఖండించలేదు. దీంతో ఇది నిజమే అని భావించారు చాలామంది. మరోసారి ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టారు. ఫైనల్ గా దర్శకుడు స్పందించి థియేటర్ రిలీజ్ మత్రమే అన్నాక అంతా శాంతించారు.
ఫైనల్ గా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పుకార్లకు చెక్ పెడుతూ.. రాధేశ్యామ్ కు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మార్చి 11న రాధేశ్యామ్ ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే కరోనా చాలా వరకూ తగ్గుముకం పట్టింది. ఫిబ్రవరిలో చాలా వరకూ అంతరించిపోతుందనే భావన అన్ని దేశాల్లో ఉంది. అందుకే మార్చి రిలీజ్ కు ప్లాన్ చేశారు. మరి ఈ సారైనా చెప్పిన టైమ్ కు చెప్పినట్టుగా వస్తారా లేదా అనేది చూడాలి.

, , , , , , , , , , ,