Advertisement
తమ విడాకులుకు కారణం చెప్పిన చైతన్య
Latest Movies Tollywood

తమ విడాకులుకు కారణం చెప్పిన చైతన్య

Advertisement

ఈ యేడాది కరోనా తర్వాత ఎక్కువ మంది మాట్లాడుకున్నది నాగచైతన్య, సమంత విడాకుల గురించే అంటే అతిశయోక్తి కాదు. మోస్ట్ లవబుల్ కపుల్ గా వీరి జంటకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోతున్నట్టు ప్రకటించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. చాలామంది అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా విడిపోవద్దని విన్నవించుకున్నారు కూడా. విడాకులుకు ఆరు నెలల ముందుగానే సమంత తన పేరుతో ఉన్న ‘అక్కినేని’అనే పదాన్ని తొలగించి విడిపోతున్న విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. అయితే అసలు వీరి డివోర్స్ కారణం ఏంటనే అంశం కూడా మోస్ట్ సెర్చింగ్ పాయింట్ గా మారింది. ఎవరికి తోచినట్టు వారు చెప్పుకున్నారు. కొందరు శ్రుతి మించి మాట్లాడుకున్నారు. దీనిపై సమంత కోర్ట్ వరకూ వెళ్లింది. కేసులు వేస్తానని బెదిరించింది. అయితే అసలు విషయం మాత్రం ఇప్పటికీ క్లియర్ గా తెలియదు. ఆ విషయంలోనే లేటెస్ట్ గా నాగచైతన్య ఓ చిన్న హింట్ ఇస్తూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూ లో నాగ చైతన్య ను ఆయన ఎంచుకునే పాత్రల గురించి అడిగారు. దానికి తన ప్రియారిటీస్ చెప్పాడు చైతూ. అలాగే చేయకూడదు అనుకునే పాత్రలేంటీ అనే ప్రశ్నకే ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. ‘నేను చేసే ఏ పాత్ర అయినా ఎవరిని వ్యక్తిత్వాన్ని కించపరచకూడదు. వ్యక్తితో పాటు కుటుంబ గౌరవానికి ఇబ్బంది కలిగించేదిగా ఉండకూడదు. ఎంతమంచి కథ అయినా అందులో ఇలాంటి అంశాలుంటే అస్సలే ఒప్పుకోను’’ ఇదీ చైతూ ఆన్సర్.
సమంత ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో చేసిన పాత్రను ఉద్దేశించే చైతూ ఈ మాటలు అన్నాడు అంటూ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. నిజమే.. వీరి విడాకులుకు ప్రధాన కారణం ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో సమంత చేసిన బోల్డ్ రోల్ కూడా ఓ ప్రధానమైన అంశం అని అప్పుడూ చెప్పుకున్నారు. ఇప్పుడు చైతూ ఇన్ డైరెక్ట్ గా అదే మేటర్ చెప్పినట్టైంది. మరి దీనికి శామ్ కూడా ఇన్ డైరెక్ట్ గా ఏదైనా కౌంటర్ ఇస్తుందేమో చూడాలి.

Advertisement