*అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట,అర్జున్ దాస్ నటిస్తున్న ‘బుట్ట బొమ్మ’ చిత్రం నుండి మొదటి పాట ‘పేరు లేని ఊరులోకి’ విడుదల *స్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటను సనాపతి భరద్వాజ్ పాత్రుడు రచించగా, మోహన

Read More

కొన్ని సినిమాలు శాశ్వత ఇమేజ్ లను ఇస్తాయి. అలా నందమూరి బాలకృష్ణకు సీమ సింహంగా, ఫ్యాక్షన్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను ఇచ్చింది సమరసింహారెడ్డి. ఈ మూవీతో పాటు ఆ తర్వాత అదే బ్యాక్

Read More

సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల

Read More

పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన చిత్రమే “భూతద్ధం

Read More

‘వారసుడు’ తెలుగులో జనవరి 14 న విడుదల చేస్తున్నాం. మన తెలుగు బిగ్గర్ స్టార్స్ చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కి గ్రాండ్ గా విడుదల కావాలని ఈ నిర్ణయం తీసుకున్నాం.‘వారసుడు’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. తెలుగులో పెద్ద విజయం సాధిస్తుంది: నిర్మాత దిల్ రాజు దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు/వారిసు తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయిక గానటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా పతాకాలపై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రోజు (సోమవారం) వారసుడు తెలుగు విడుదల తేదిని తెలియజేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘వారసుడు’ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. తమిళ్ లో ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విదుదలౌతుంది. ఈ నిర్ణయం వెనుక వున్న కారణం.. జనవరి 12 బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి, జనవరి 13న చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదలౌతున్నాయి. ప్రతి థియేటర్ లో ముందు మన తెలుగు బిగ్గర్ స్టార్స్ సినిమాలు పడాలి. అన్ని చోట్ల వారికి థియేటర్లు దొరకాలి. తర్వాతే నా సినిమా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. సంక్రాంతి సినిమాలకి మా వారసుడు పోటి కాదని మొదటి నుండి చెబుతున్నాను. మాది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు సంక్రాంతి వారసుడు చేయాలనేదే నా ప్రయత్నం. బాలకృష్ణ గారి చిరంజీవి గారి సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రిలీజ్ కావాలి. తర్వాత నా సినిమా రావాలని పాజిటివ్ గానే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం పట్ల ఇండస్ట్రీ పెద్దలు చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందరం బావుండాలనే నేను ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. 11న తమిళ్ లో విడుదలౌతున్న ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ కాబోతుంది. ఒక చోట విజయం సాధిస్తే ఆ చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగా వుంటారు. కాంతార, లవ్ టుడే చిత్రాలు ఇది నిరూపించాయి. మా గత చిత్రాలు సీతమ్మ వాకిట్లో, ఎఫ్ 2, శతమానం భవతి సినిమాల్లనే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసే చిత్రం వారసుడు. ఒక మంచి సినిమా చుశామనే అనుభూతిని ఇస్తుంది వారసుడు. ఇది దిల్ రాజు బ్రాండ్. తమన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. విజయ్ ఆల్రెడీ సూపర్ స్టార్. ఇందులో అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో శరత్ కుమార్, జయసుధగారు తల్లితండ్రులుగా.. విజయ్, శ్రీకాంత్ శ్యాం బ్రదర్స్ గా కనిపిస్తారు. ఇది పక్కా ఫ్యామిలీ స్టొరీ. ఇందులో ఫ్యామిలీ కోణంలో ఒక కొత్త పాయింట్ చెబుతున్నాం. సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింట్ ప్రేక్షకులకు గుర్తిండిపోతుంది. ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా ఫీలౌతారు. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటికి వస్తారు. మా సంక్రాంతి వారసుడు మళ్ళీ సంక్రాంతికి తెలుగులో కూడా ఒక మంచి హిట్ సినిమా కాబోతుంది’’ అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. వారసుడు యునివర్సల్ సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. మన తెలుగు స్టార్స్ కి గౌరవం ఇస్తూ.. ఇన్ని కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాని 14కి వాయిదా వేయడం నిజంగా గ్రేట్. దిల్ రాజు గారికి హ్యాట్సప్. ఇంత సాహసం ఏ నిర్మాత చేయరు. వారసుడు నా తొలి తమిళ సినిమా. అలాగే దిల్ రాజు గారి బ్యానర్ లో చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా గురించి చెప్పాలంటే విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు గారి గురించి చెప్పాలి. విజయ్ తో సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి చాలా కాలమైయింది. ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు సినిమాలానే ఫీలౌతాము. వారసుడు సంక్రాంతికి లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తుందని నమ్ముతున్నాను. వారసుడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది.’’ అన్నారు

Read More

శాకుంతల కథ గురించి గత రెండు తరాలకు పెద్దగా తెలియదు కానీ.. పుస్తకాలు చదివిన తరాలకు బాగా తెలుస్తుంది. మహాకవి కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యం తెలుగు సాహిత్యంతో అత్యంత ప్రజాదరణ పొందిన

Read More

ఇండియాలో టాప్ యాక్టర్ ఎవరూ అని ఓ టాప్ డైరెక్టర్ ను అడిగితే ఏం చెబుతాడు. పైగా ఈయన ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను క్రియేట్ చేసిన డైరెక్టర్ అని కూడా చెప్పుకుంటున్నాం. అంటే

Read More

అంచనాలు పెంచడం అంటే మాటలు కాదు.. అందుకోసం మాటలే చెప్పాలి. ఆ మాటలతో మాయ చేస్తూ.. ప్రేక్షకులకు తమ చిత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగేలా చేయాలి. అలా చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందే

Read More

బింబిసార.. 2022 ఆగస్ట్ 5న విడుదలైన ఈ మూవీకి యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ మూవీలో కళ్యాణ్‌ రామ్ నటన కూడా అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.

Read More

యశ్ .. ఓ బస్ డ్రైవర్ కొడుకుగా కన్నడ సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. సీరియల్స్ లో నటించి మెల్లగా శాండల్ వుడ్ లో హీరోగా మారాడు. ఒక్కో సినిమాతో

Read More