Advertisement
హాట్‌ స్టార్‌కు కాసుల వర్షం!
Latest Movies Tollywood

హాట్‌ స్టార్‌కు కాసుల వర్షం!

Advertisement

బిగ్‌బాస్‌ తెలుగు ‘నాన్ స్టాప్’ కార్యక్రమం సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. గత శనివారం ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్.. అనివార్య కారణాలతో బ్రేక్ పడినా.. తిరిగి 24 గంటల వ్యవధిలో పున:ప్రారంభమైంది. స్టార్‌ మాలో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ 5 సీజన్లకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ వచ్చింది. అయితే ఆరో సీజన్‌ను డిస్నీ హాట్ స్టార్‌‌లో ఓటీటీ వేదికగా ప్రజల ముందుకు తెచ్చారు నిర్వాహకులు. బిగ్‌బాస్‌ ప్రారంభమైన నాటి నుంచి పది లక్షలకు పైగా కొత్త సబ్‌స్ర్కబ్‌ జాయిన్‌ అయ్యారట. ఇటీవల కాలంలో ఓటిటీపై ఓ తెలుగు షోకు అత్యధిక లాగిన్స్ ఇదే కావడం విశేషం అని హాట్ స్టార్ తెలియజేసింది.

ఈ లెక్కన చూసుకుంటే.. ఓటీటీ బిగ్‌బాస్ కోసం ఇప్పటి వరకు 10 లక్షల మంది డిస్నీ హాట్ స్టార్‌‌ని సబ్‌స్క్రబ్ చేసుకున్నారట. హాట్ స్టార్ ప్రీమియం ప్లాన్ 1499 రూపాయలు, సూపర్ ప్లాన్ 899, మంత్లీ ప్లాన్ 299‌గా ఉంది. ప్రీమియం ప్లాన్ అంటే తెలుగుతో పాటు మిగిలిన లాంగ్వేజ్‌లు కూడా వస్తుండడంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి చూపలేదట,

ఇక బిగ్‌బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో మూడు నెలలు ప్రసారం కానుండడం.. ఆ తరువాత సీజన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి.. నెలవారీ ప్లాన్ రూ.299కి కాకుండా.. ఏడాది సూపర్ ప్లాన్ రూ.899 యాక్టివేట్ చేసుకుంటున్నారట. ఈ లెక్కన 10 లక్షల సబ్‌స్క్రబర్స్‌.. 899 ప్లాన్‌ తీసుకుంటే.. హాట్ స్టార్ వారం ఆదాయం రూ.89.9 కోట్లు. లాగిన్స్ ద్వారా వచ్చిన ఆదాయమే ఇంత ఉంటే.. ఇంకా యాడ్స్ రూపంలో వచ్చే రెవెన్యూ చూస్తే మతి పోవాల్సిందే.

Advertisement