ఏ కథకుడైనా తన కథను ఫలానా హీరో మోస్తాడు అనే రాసుకుంటాడు. దర్శకులు కూడా అందుకు తగ్గట్టుగానే ప్లాన్స్ చేసుకుని స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి.. షాట్ డివిజన్ ఎలా ఉండాలి అనే అంశాల్లో కసరత్తులు చేస్తాడు. అయితే ఒక హీరోకు అనుకున్న మరో హీరోకు వద్దకు వెళితే సమస్యలు తప్పవు. చాలా మార్పులు ఉంటాయి. ఎలివేషన్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకూ ఛేంజెస్ చేయాలి. లేదంటే మొత్తానికే మోసం వస్తుంది. ఇదే టైమ్ లో ఒక హీరో నో చెప్పిన కథతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న సందర్భాలు కూడా టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అలా జరుగుతుందా లేదా అప్పుడే చెప్పలేం కానీ.. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ వినిపిస్తోంది.వరుసగా ఫ్లాపులు.. ఎప్పుడో కానీ హిట్టూ కొట్టని హీరో రామ్ తో ఇప్పుడు ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ సినిమా చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. బట్ క్రేజీ కదా అనుకున్నారు. హీరోలకు తగ్గట్టుగా కథలు రాసుకుంటే ఏం సమస్య ఉండదు కదా.. కానీ ఈ కథ రామ్ కోసం రాసింది కాదట.

అల్లు అర్జున్ కోసం సిద్ధం చేయించిన స్టోరీ. ఆ మధ్య పుష్ప తర్వాత ఐకన్ స్టార్ – బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే వార్తలు కూడా చాలానే వచ్చాయి కదా.. ఆ టైమ్ లో అర్జున్ కు చెప్పి దాదాపు ఒప్పించిన కథనే రామ్ తో చేస్తున్నాడు అనే వార్త లేటెస్ట్ గా వినిపిస్తోంది.గతంలో బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఫస్ట్ టైమ్ వంద కోట్ల క్లబ్ లో చేర్చిన సినిమ కూడా ఇదే కావడం విశేషం.

అప్పటికి ఇంత ఇమేజ్ లేని అతనితోనే సరైనోడులో ఓ రేంజ్ లో యాక్షన్ చేయించాడు. మరి ఇప్పుడు అతని కోసం కథ అనుకుంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించండి. ఇప్పుడు ఆ ఊహల్లోకి అల్లు అర్జున్ ను తీసేసి రామ్ ను చేర్చండి.. మ్యాచ్ కావడం లేదు కదూ..?యస్ ఇప్పుడు అందరి డౌట్ ఇదే. అల్లు అర్జున్ కథలో రామ్ ఎలా ఇమిడిపోతాడా అని. ఇప్పటికే వారియర్ లో రామ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కామెడీగా మారాయి. మరి బోయపాటి రేంజ్ యాక్షన్ అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది.ఎవరి డౌట్స్ ఎలా ఉన్నా.. వీళ్లు మాత్రం చాలా వేగంగా షూటింగ్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఊర్వశి రౌతేలాతో ఓ స్పైసీ ఐటమ్ సాంగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం స్టంట్ శివ కొరియోగ్రఫీలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదలవుతుంది.

,