Advertisement
“పుష్ప” స‌క్సెస్ మీట్ లో బన్నీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్
Latest Movies Tollywood

“పుష్ప” స‌క్సెస్ మీట్ లో బన్నీ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా అంచ‌నాల‌కు మించిన విజ‌యాన్ని సొంతం చేసుకుని స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా పుష్ప విజ‌యాన్ని పుర‌స్క‌రించుకుని స‌క్స‌స్ మీట్ ను తిరుప‌తిలో చాలా గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో అల్లు అర్జున్ ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలిచారు. ఈ సినిమా కోసం తాను ప‌డిన క‌ష్టం కంటే ఎక్కువుగా చిత్ర యూనిట్ క‌ష్ట‌ప‌డింది అంటూ పుష్ప యూనిట్ ను బ‌న్నీఎంత‌గానో అభినందించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. చిత్తూరు యాస మాట్లాడ‌డం కోసం రెండు సంవ‌త్స‌రాల పాటు నేర్చుకున్నాను. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను చిత్తూరులో పెట్టాల‌ని అనుకున్నాను. అందుక‌నే పుష్ప రిలీజ్ త‌ర్వాత ఫ‌స్ట్ స‌క్స‌స్ మీట్ ను ఇక్క‌డ పెట్ట‌డం జ‌రిగింది. ఇక సుకుమార్ గురించి చెప్పాలంటే.. ఆయ‌న పేరుకు త‌గ్గ‌ట్టుగా సుకుమారంగా ఉంటార‌నుకుంటే.. పొర‌పాటే. సుకుమార్ అంటే ఫైర్. పుష్ప సినిమాని ఇంత‌గా ఆద‌రిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

పుష్ప నుంచి నాకు పేరు వచ్చినా, ఇంకేది వచ్చిన ఆ క్రెడిట్ అంతా మా సుకుమార్ గారిదే. ఇంకా ఇంత కంటే సినిమా గురించి నేనేం చెప్పలేను. మీ వెనకాల ఆ ఏడుకొండల స్వామి ఎలా ఉన్నాడో, నా వెనకాల మా సుకుమార్ అలా ఉన్నాడు. ఇంత కంటే ఆయ‌న గురించి ఇంకా ఏం చెప్పాలి. మా శ్రీవ‌ల్లి సినిమాలోనే కాదు.. బ‌య‌ట ర‌ష్మిక‌గా కూడా నాకు చాలా న‌చ్చింది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం, పాట‌లు ఎలా ఉన్నాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇంత పెద్ద విజ‌యాన్ని అందించిన అంద‌రికీ మ‌న‌స్పూర్తిగా ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అన్నారు.

Advertisement