Advertisement
బన్నీ మర్యాదరామన్న – చంద్రబోస్ చెప్పిన ‘హ్యాపీ’ కథ
Latest Movies Tollywood

బన్నీ మర్యాదరామన్న – చంద్రబోస్ చెప్పిన ‘హ్యాపీ’ కథ

Advertisement

హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అల్లు అర్జున్ పుష్ప సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజమౌళి, మారుతి, కొరటాల శివ, వెంకీ కుడుముల, బుచ్చిబాబు తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ..అల్లు అర్జున్ ఎంత మంచీ మర్యాదలు గలవాడో చంద్రబోస్ ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇన్సిడెంట్ తో చెప్పారు.

హ్యాపీ సినిమా షూటింగ్ విదేశాల్లో జరిగినప్పుడు పాట రాసేందుకు చంద్రబోస్ అక్కడికి వెళ్లారు. చంద్రబోస్ ను ఎదురెళ్లి ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకున్న అల్లు అర్జున్. చంద్రబోస్ బ్యాగేజ్ తీసుకుని కారులో పెట్టారట. వద్దు నా బ్యాగ్ మీరెందుకు తీసుకొస్తున్నారు అని చంద్రబోస్ అడగగా.. మీరు మా అతిథి , మీలాంటి గొప్ప రచయితలను గౌరవించుకోవడం నా బాధ్యత అంటూ చంద్రబోస్ లగేజ్ తీసుకొచ్చారట. అదీ అల్లు అర్జున్ కు పెద్ద వాళ్ల పట్ల ఉన్న మర్యాద అంటూ చెప్పారీ గ్రేట్ రిలిసిస్ట్.

Advertisement