బన్నీ ఆ ఇద్దరు సూపర్‌ స్టార్లకి దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చాడు..

బన్నీ ఆ ఇద్దరు సూపర్‌ స్టార్లకి దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చాడు..


బన్నీ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ సూపర్‌స్టార్‌. `అల వైకుంఠపురములో` బ్లాక్‌ బస్టర్‌ ఆయన్ని తిరుగులేని సూపర్‌ స్టార్‌ని చేసింది. ఈ చిత్రంలో బన్నీ చూపించి ప్రత్యేకతలే ఆయన్ని మరో రేంజ్‌కి తీసుకెళ్ళాయి. ఇందులో ఆయన చేసే కొత్త తరహా డాన్సులు, స్టయిలీష్‌ ఫైట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. నటుడిగానూ ఆయన మంచి మెచ్యూరిటీ కనిపించింది. దీంతో సౌత్‌లో మరింత క్రేజ్‌ ఏర్పడింది.  తాజాగా బన్నీ ఇద్దరు సూపర్‌ స్టార్స్ మహేష్‌బాబు, ఎన్టీఆర్‌లకు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చారు. వారిని మించిన క్రేజ్‌ని సంపాదించుకున్నారు. తాజాగా బన్నీ`పుష్ప` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసింది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ఇటీవల విడుదల చేశారు. ఒకేసారి తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. తాజాగా ఈ లుక్‌ అత్యధిక వ్యూస్‌, లైక్‌లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఎన్టీఆర్‌, మహేష్‌లను మించిపోయాడు. ఎన్టీఆర్‌ నటించిన `అరవింద సమేత` చిత్ర ఫస్ట్ లుక్‌కి 70.2వేల లైక్స్ వచ్చాయి. మహేష్‌ నటించిన `మహర్షి`కి 67.2వేల లైక్స్ వచ్చాయి. తాజాగా విడుదలైన బన్నీ `పుష్ప`కి ఏకంగా 80.1 లైక్స్ రావడం విశేషం. దీంతో ఆయా స్టార్స్ ని క్రాస్‌ చేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ఇదే ఇప్పుడు బన్నీకి ఉన్న విపరీతమైన క్రేజ్‌ని నిదర్శనంగా నిలుస్తుంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీన్నిపాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.