Advertisement
ఈ సారి పుష్ప కోసం జిగేల్ రాణిని తెస్తున్నారా
Latest Movies Tollywood

ఈ సారి పుష్ప కోసం జిగేల్ రాణిని తెస్తున్నారా

Advertisement
సుకుమార్ సినిమా అంటే ఐటమ్ సాంగ్స్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటాయని ఆర్య నుంచే చూస్తున్నాం. ఈ విషయంలో సుకుమార ఎందుకో చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. సాహిత్యంతో పాటు ఐటమ్ గాళ్స్ కూడా హద్దులు దాటేలా ఉన్నా ఓకే చేస్తుంటాడు. ఇంకా చెబితే అతనే అలా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు అనేవారూ ఉన్నారు. పైగా ప్రతి సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు సుకుమార్. అందుకే అతని సినిమాల్లోని ఈ స్పెషల్ సాంగ్స్ ఆ యేడాదికి కూడా స్పెషల్ గా నిలుస్తుంటాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప చిత్రంలోని సమంతతో చేయించిన ఊ అంటావా మావా ఊ ఊ అంటావా పాట ఇప్పుడు అన్ని ఏజ్ ల వారినీ హమ్ చేయిస్తూ ఉందంటే ఆ క్రెడిట్ సుకుమార్ స్పెషల్ కేర్ దే. అల్లు అర్జున్ కోసం సమంత వంటి టాప్ హీరోయిన్ ను అది కూడా తను అప్పుడు ఉన్న సిట్యుయేషన్ లో ఒప్పించిన సుకుమార్ ఈ సారి మళ్లీ తన జిగేల్ రాణి పూజాహెగ్డే ని తీసుకురాబోతున్నాడట.
పుష్ప ది రైజ్ లో సమంత ఐటమ్ ఎలా అయితే స్పెషల్ గా నిలిచిందో.. పుష్ప ది రూల్ లో పూజాహెగ్డేను కూడా తీసుకురాబోతున్నట్టు టాక్. యస్.. పుష్ప ఫస్ట్ పార్ట్ లో లాగానే సెకండ్ పార్ట్ లో కూడా అద్దిరిపోయే ఓ ఐటమ్ సాంగ్ ఉంటుందట. ఈ పాట కోసం ఏకంగా పూజాహెగ్డేనే తీసుకు వస్తున్నట్టు టాక్. ఈ పాటను ఫలానా టైమ్ లో షూట్ చేస్తారు అనేది ఇంకా తేలలేదు కానీ.. ఎప్పుడు షూట్ చేసినా పూజాతో చేయించాలనే ప్రయత్నాల్లో సుకుమార్ అండ్ టీమ్ ఉందట. పూజా కూడా ఆల్రెడీ బన్నీ తో చేసిన దువ్వాడ జగన్నాథమ్ తోనే ఫేమ్ అయింది. అలాగే సుకుమార్ కోసం రంగస్థలంలో చేసిన జిగేల్ రాణి సాంగ్ తనకు తిరుగులేని క్రేజ్ ను తెచ్చింది. మరి అలాంటి ఇద్దరు కలిసి చేస్తోన్న సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే కాదంటుందా.. పైగా ఇలాంటి ఐటమ్స్ కు రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది కదా.. సో.. పుష్ప సెకండ్ పార్ట్ లో మనం జిగేల్ రాణి ఐటమ్ సాంగ్ చూడబోతున్నామన్నమాట.

Advertisement