సీసీసీకి బ్రహ్మీ విరాళంపై నెటిజన్ల ఫైర్‌..

సీసీసీకి బ్రహ్మీ విరాళంపై నెటిజన్ల ఫైర్‌..


ఆయన టాలీవుడ్‌ కామెడీ కింగ్‌. ఆయన తెరపైనే కనిపిస్తేనే ఆడియెన్స్ పగలబడి నవ్వుతారు. ఆయన్ని చూస్తే నవ్వాపుకోవడం ఎవరి తరం కాదు. ఆయన రూపం, ఆయన చేసే చేష్టలు అలా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. దాదాపు మూడు దశాబ్దాలపాటు టాలీవుడ్‌ సినిమాను ఓ ఊపు ఊపేసిన హాస్యనటుడు.  స్టార్‌ హీరో రేంజ్‌ పారితోషికం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నవతరం హాస్య నటులు రావడంతో కాస్త వన్నెతగ్గింది. ఓ రకంగా ఆయన్ని పక్కన పెట్టేశారు. ఆయన డిమాండ్లని భరించలేక సినిమాల్లోకి తీసుకునేందుకు నేటితరం దర్శక, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. దీంతో అడపాదడపా ఒకటి రెండు సినిమాలకే పరిమితమవుతున్నారు. ఆయన ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. హాస్య బ్రహ్మా బ్రహ్మానందం. కామెడీ అంటే బ్రహ్మానందమే గుర్తొచ్చేంతగా పేరుతెచ్చుకున్న ఆయన ఇప్పుడు నెటిజన్ల ఫైర్‌కి గురవుతున్నాడు. అందుకు కారణం ఆయన సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీకి మూడు లక్షల విరాళం ప్రకటించడమే. విరాళ ప్రకటించడం అభినందనీయమే అయినా, స్టార్‌ కమెడీయన్‌గా ఉన్న ఆయన కేవలం మూడు లక్షలే ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.  కరోనా ప్రభావం మన చిత్ర పరిశ్రమపై ఎంతో ఉంది. చిత్రపరిశ్రమ మొత్తం ఆగిపోయింది. దాదాపు ఇరవై రోజులు ఇలాంటి పరిస్థితితో సినీ, పేద కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, అందరు తారలంతా విరాళాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇంత లేట్‌గా బ్రహ్మీ స్పందించడం, అది కూడా కేవలం మూడు లక్షలే విరాళంగా ప్రకటించడం పట్ల నెటిజన్లే కాదు, సినీ క్రిటిక్స్ సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరో రేంజ్‌లో తన హవా సాగించుకుని, భారీ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసి నిర్మాతలకు చుక్కలు చూపించిన ఓ టాప్‌ కమెడీయన్‌ ఇంత తక్కువగా విరాళం ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లే కాదు, ఆయన ఫ్యాన్స్ కూడా ఫైర్‌ అవుతున్నారు. ఆయనకు సంబంధించి కామెడీ క్లిప్ లనే ట్రోల్‌ చేస్తున్నారు. మీమ్స్ చేస్తున్నారు. మరి దీనిపై బ్రహ్మీబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Leave a Reply

Your email address will not be published.