ఓటిటి అంటే యూనివర్సల్ కంటెంట్ అవైలబుల్ గా ఉంటుంది. ఎవరికి నచ్చిన జానర్ సినిమాలను వాళ్లు చూసుకోవచ్చు. అయితే కొన్ని జానర్స్ కు లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు.అలాంటి వారికోసం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దహన్ అనే వెబ్ సిరీస్ రెడీగా ఉంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సిరీస్ బెస్ట్‌ ఆప్షన్ గా చెప్పొచ్చు. క్రిటిక్స్ సైతం ఈ సిరీస్ ను ది బెస్ట్ అని చెప్పుకుంటున్నారు. శిలాష్‌ పూర్ అనే ఓ ఫిక్షనల్ విలేజ్ లో జరిగే కథే ఈ దహన్ అనే వెబ్ సిరీస్. ఆ ఊరిలో ఓ మైనింగ్ బిజినెస్ ఉంటుంది. మరోవైపు ఓ చిన్న పాటి గుడి లాంటి రహస్య ప్రదేశం ఉంటుంది. అందులోకి ఎవరూ వెళ్లకూడదు. వెళితే రక్తం కక్కుకుని చస్తారు. లేదంటే ఎవరైనా చంపేస్తుంటారు.

ఈ మైనింగ్ వ్యాపారులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారి పని జరిగేలా చూసేందుకు ఆ ఊరికి ఓ లేడీ కలెక్టర్ తన కొడుకుతో కలిసి వస్తుంది. తను గ్రామస్తుల నమ్మకాలను మూఢ నమ్మకాలుగా భావించి కొట్టి పారేస్తూ మైనింగ్ వ్యాపారానికి పర్మిషన్ ఇవ్వాలని గ్రామస్తులను ఒత్తిడి చేస్తుంది. కట్ చేస్తే ఆమె కొడుకు కూడా వింతగా ప్రవర్తిస్తుంటాడు. అటుపై ఆమె లోనూ తెలియని మార్పులు కనిపిస్తుంటాయి. మరి దీనికి కారణం ఏంటీ.. నిజంగానే గ్రామస్తులు చెప్పినట్టుగా ఆ ఊరిలో అతీంద్రియ శక్తులు ఉన్నాయా అనేది తెలియాలంటే ఈ సీరీస్ చూడాల్సిందే.

దహన్ తొమ్మది భాగాలుగా ఉన్న సిరీస్. రెండు మూడు భాగాలు అక్కడక్కడా కాస్త సాగదీసినట్టుగా కనిపించినా.. చివరి నాలుగు మాత్రం వెరీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగుతాయి. అయితే కాస్త రక్త పాతం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఇష్టపడేవారిని మరింత బాగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ప్రధాన పాత్రల్లో టిస్కా చోప్రా, సౌరభ్ శుక్లా, రాజేష్‌ టైలంగ్, ముకేష్ తివారీ నటించారు. రైహన్ రఫీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజువల్స్ కూడా ఆశ్చర్యపరుస్తాయి. క్వాలిటీ గ్రాఫిక్స్ మెప్పిస్తాయి. ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఎక్స్ పీరియన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ దహన్ ను చూసేయొచ్చు.

, , , , , , ,