టాలీవుడ్ హ‌వా క్ర‌మంగా పెరుగుతోంది. మ‌న సినిమాలు బాలీవుడ్ సినిమాల‌నే ప‌క్క‌కి తోసేస్తూ ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి. ఒక‌ప్పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోని తెలుగు సినిమాల‌ను, టాలీవుడ్ స్టార్స్‌ను ఇప్పుడు దేశం యావ‌త్తు ఫాలో అవుతుంది. వారి స్టైల్‌ను అనుక‌రిస్తూ రీల్ వీడియోలు చేసేస్తున్నారు. పొలిటీషియ‌న్స్ కూడా ఇప్పుడు టాలీవుడ్‌పై ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది.. ముఖ్యంగా బీజేపీ నాయ‌కులు.

రీసెంట్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ని ప్ర‌త్యేకంగా క‌లిశారు. వారిద్ద‌రూ క‌లిసి డిన్న‌ర్ కూడా చేశారు. వారేం మాట్లాడుకున్నారో ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. కానీ.. తెలంగాణ బీజేపీలోకి ఎన్టీఆర్‌ని ఆయన ఆహ్వానించారని, ఇక్కడ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రిని చేస్తామన్నారని కొందరు తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరికొందరైతే ఏపీపై బీజేపీ ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని అందుకనే తారక్‌ని అమిత్ షా కలిశారని, తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కైవ‌సం చేసుకోబోతున్నార‌ని, అదీ ఇదీ అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ వేడి చ‌ల్లార‌క ముందే మ‌రో తెలుగు హీరోను మ‌రో బీజేపీ అగ్ర నాయ‌కుడు క‌లవ‌బోతున్నారు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో తెలుసా!.. నితిన్‌. బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.

ఈరోజు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌బోతున్నార‌ట‌. దీంతో అస‌లు బీజేపీ నాయ‌కులు ఎందుకు టాలీవుడ్ హీరోల‌ను ప్ర‌త్యేకంగా క‌లుస్తున్నారా? అనేది ప్ర‌త్యేక‌మైన చ‌ర్చ‌గా మారింది. మరి భవిష్యత్తులో ఇంకెంత మంది తారలను బీజేపీ నాయకులను కలుస్తారో చూడాలి మరి.

, , , ,