Advertisement
ఇన్ టైమ్ కే ఫినిష్ చేస్తానంటున్న “భీమ్లా నాయక్”
Latest Movies Tollywood

ఇన్ టైమ్ కే ఫినిష్ చేస్తానంటున్న “భీమ్లా నాయక్”

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్. మలయాళ హిట్ ఫిల్మ్ అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీ ప్లే మాటలు అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మాణంలో దర్శకుడు సాగర్ కె చంద్ర రూపొందిస్తున్న భీమ్లా నాయక్ సినిమా లో రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహా భీమ్లా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మిగిలిన బ్యాలెన్స్ షూట్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

జనవరి 25వ తేదీ నుంచి భీమ్లా నాయక్ బ్యాలెన్స్ షూటింగ్ తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ స్మాల్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ అవనుంది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి అనుకున్న డేట్ ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. సంక్రాంతి పండగ, ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యానే కొంత షూటింగ్ ఆలస్యమైనట్లు చిత్ర బృందం చెబుతోంది. సంక్రాంతి రిలీజ్ ఉంటే హడావుడిగా వర్క్ కంప్లీట్ చేసేవాళ్లు. కానీ థర్డ్ వేవ్ దృష్ట్యా విడుదల వాయిదా పడటంతో బ్యాలెన్స్ షూట్ కూల్ గా కంప్లీట్ చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది.

పవర్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో భీమ్లా తో పాటు హరిహర వీరమల్లు ఉంది. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాణంలో జరుగుతోంది. కోవిడ్ వల్ల బాగా ఎఫెక్ట్ అయిన సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఫస్ట్ , సెకండ్ వేవ్ లతో పాటు లాక్డౌన్ ను ఎదుర్కొందీ సినిమా. ఇప్పుడు థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా సినిమా షూటింగ్ పై పడుతోంది. చారిత్రక నేపథ్య సినిమా కాబట్టి మేకింగ్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాస్త ఆలస్యమైనా హరిహర..ను క్వాలిటీగానే స్క్రీన్ మీదకు తీసుకొస్తారట. ఇక షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా అన్ని చిత్రాల్లాగే హరిహర వీరమల్లు కూడా ఇంకొంత పోస్ట్ పోన్ అయ్యేలాగే ఉంది.

Advertisement