ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు వరుణ్ ధావన్ నటిస్తున్న “భేదియా” చిత్రంతో  మరో హారర్-కామెడీ యూనివర్స్‌ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతుంది.

వరుణ్ ధావన్ మరియు కృతి సనన్ నటిస్తున్న సినిమా “భేదియా”  
ఈ చిత్రం నుండి  ‘తుమ్కేశ్వరి’ అనే  మొదటి పాట ఇటీవల విడుదలైంది మరియు ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్ ను అధికారికంగా లాంచ్ చేశారు.భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిలిపివరాలే ఇవ్వు  పాటను కార్తీక్ ఆలపించారు. ఈ వీడియో సాంగ్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి అమితాబ్ భట్టాచార్య & యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు.

2018 లో వచ్చిన స్త్రీ, 2021 లో వచ్చిన రూహి తరువాత, దినేష్ విజన్ యొక్క హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న చిత్రం “భేదియా” ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హిందీ, తమిళం మరియు తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది.ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో “గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా “భేదియా” తెలుగులో విడుదల చేస్తున్నారు.

, , ,