Advertisement
బంగార్రాజు ట్రైలర్ .. టెంప్లేట్ నే ఫాలో అయ్యారా..?
Latest Movies Tollywood

బంగార్రాజు ట్రైలర్ .. టెంప్లేట్ నే ఫాలో అయ్యారా..?

Advertisement

బంగార్రాజు.. ఈ సంక్రాంతి పండగకు వస్తోన్న సినిమా. పైగా బరిలో కేవలం బంగార్రాజు మాత్రమే పెద్ద సినిమా. ఎక్కువమందికి తెలిసిన సినిమా. అందుకే ఈ మూవీపై ఇండస్ట్రీలో కూడా అంచనాలున్నాయి. సంక్రాంతికి మరే పెద్ద సినిమాలూ లేవు కాబట్టి.. తండ్రీ కొడుకు కలిసి పండగను సూపర్ హిట్ గా క్యాష్ చేసుకుంటారు అనుకుంటున్నారు. ఆ మేరకు కొన్నాళ్లుగా ప్రమోషన్స్ తో అంచనాలు పెంచుతూ వెళుతోంది టీమ్. ఇక లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేశారు. టీజర్ తో ఇంప్రెస్ చేసిన వీళ్లు.. ఆ ఇంప్రెషన్ ను ఎక్స్ టెండ్ చేయడంలో ట్రైలర్ విషయంలో గొప్పగా ఏం చెప్పలేకపోయారనే చెప్పాలి. ట్రైలర్ పూర్తిగా సోగ్గాడే చిన్ని నాయనా టెంప్లేట్ లోనే సాగింది. రొమాన్స్, యాక్షన్, ఫాంటసీ అంటూ ఓ కొలతలో వేసినట్టుగా కనిపించింది.
మొదటే నాగార్జున పై లోకంలో దేవ నర్తకీమణులతో ఆడే ఓ పాట.. కట్ చేస్తే నాగచైతన్య ఎంట్రీ.. అతన్న ప్లే బాయ్ లా చూపించే సన్నివేశాలు.. తర్వాత హీరోయిన్.. ఊరి సర్పంచ్ గా బిల్డప్ నాగమణిలా కనిపిస్తుంటే.. ఈ ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు ఇరవైయేళ్ల క్రితం నాటివిగా కనిపిస్తున్నాయి. ఆపై విలన్ ఎంట్రీ.. చైతూ నిస్సహయుడైనప్పుడల్లా నాగ్ ఆత్మరూపంలో అడ్డుపడి కనిపించకుండా కాపాడ్డం.. ఇలా ఓ కొలత వేసినట్టుగా సాగింది ట్రైలర్. ఇంకా చెబితే అద్భుతం అనిపించే ఒక్క షాట్ కానీ, ఫ్రేమ్ కానీ కనిపించలేదీ ట్రైలర్ లో. ఈ విషయంలో నాగ్ అండ్ టీమ్ నిరుత్సాహపరిచారు అనే చెప్పాలి.
అయితే పండగ ఆడియన్సెస్ కు కావాల్సిన స్టఫ్ మాత్రం కనిపిస్తోంది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లోని మాస్ ఆడియన్సెస్ ను టార్గట్ చేసుకునే చిత్రాన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. అంటే మెట్రో ఏరియాస్ లో మరీ గొప్పగా మెప్పించలేకపోవచ్చు. అయినా మెప్పిస్తే సినిమా అద్భుతం చేసినట్టే. మొత్తంగా నాగ్ తో పాటు రమ్యకృష్ణ రిపీట్ అయితే.. చైతూ సరసన కృతిశెట్టి హుషారుగా కనిపించింది. అలాగే సోగ్గాడేలోని కొన్ని పాత్రలు రిపీట్ అయ్యాయి. మొత్తంగా ఓ టెంప్లేట్ లో సాగినట్టు కనిపించిన ట్రైలర్ లో మెరుపులు పెద్దగా లేవనే చెప్పాలి.

Advertisement