Advertisement
“బంగార్రాజు” నిజంగా రెడీనా..?
Latest Movies Tollywood

“బంగార్రాజు” నిజంగా రెడీనా..?

Advertisement

సంక్రాంతి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్.. చిత్రాలు విడుద‌ల అని ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ జ‌న‌వ‌రి 7న‌, రాధేశ్యామ్ జ‌న‌వ‌రి 14 విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. అయితే.. భీమ్లా నాయ‌క్ కూడా సంక్రాంతికి వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అయితే.. ఆర్ఆర్ఆర్ వ‌స్తుండ‌డంతో భీమ్లా నాయ‌క్ సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. కింగ్ నాగార్జున‌, యువ స‌మ్రాట్ నాగ‌చైత‌న్య క‌లిసి చేస్తున్న బంగార్రాజు చిత్రం కూడా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ఒక్కో పాట రిలీజ్ చేస్తూ.. ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. అయితే.. సంక్రాంతికి వ‌స్తుందా..? లేదా..? అనేది మాత్రం క్లారిటీగా చెప్ప‌డం లేదు. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయ‌క‌పోవ‌డంతో బంగార్రాజు మూవీ పై ఇంకా స‌స్పెన్స్ అలాగే కొన‌సాగుతుంది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాల‌కు భారీగా థియేట‌ర్లు కావాలి. అందుచేత బంగార్రాజుకు భారీ స్థాయిలో థియేట‌ర్లు ల‌భించ‌ని ప‌రిస్థితి. దీంతో ఏం చేస్తారు..? త‌క్కువ థియేట‌ర్లో రిలీజ్ చేస్తారా..? వాయిదా వేస్తారా… అనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా వుంటే.. ఓ ఓటీటీ కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నాగార్జున బంగార్రాజు రిలీజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు సినిమా సిద్ధమైంది. దాని గురించి వేరే చోట మాట్లాడుకుందాం అని నాగార్జున‌ సమాధానం చెప్పారు. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రావడం ఖాయం అని తెలుస్తోంది. కాక‌పోతే ఎన్ని థియేట‌ర్లు దొరుకుతాయి అనేది క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత బంగార్రాజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం.

Advertisement