Advertisement
 కెరీర్ లో తొలి సెంచరీ కొట్టిన బాలయ్య
Latest Movies Tollywood

 కెరీర్ లో తొలి సెంచరీ కొట్టిన బాలయ్య

Advertisement

నందమూరి బాలకృష్ణ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కాదని మరోసారి ప్రూవ్ అయింది. అఖండతో రోరింగ్ హిట్ అందుకున్నాడు బాలయ్య. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడే అందర్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని అందుకోవడంలో ఏ మాత్రం తడబడలేదీ మాసివ్ కాంబో. కంటెంట్ వీక్ గా ఉన్నా.. కథన మాయతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది అఖండ. దీనికి తోడు ఈ మూవీకి ఏ పోటీ లేదు. దీంతో ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న అఖండతో బాలయ్య కెరీర్ లోనే ఓ కొత్త రికార్డ్ సాధించాడు.
ఎంత టాప్ హీరో అయినా కలెక్షన్స్ పరంగా ఇతరులతో పోలిస్తే కాస్త వెనకబడి ఉన్నాడు బాలయ్య. ఆ బాధను కూడా అఖండ జయించింది. ఫస్ట్ టైమ్ బాలయ్య కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ ఆదివారంతో అఖండ వంద కోట్ల గ్రాస్ ను సాధించింది. ఓవర్శీస్ లో కూడా ఒన్ మిలియన్ కు అతి కొద్ది దూరంలో మాత్రమే ఉన్నాడు. దీంతో ఇటు సెంచరీతో పాటు ఒన్ మిలియన్ రికార్డ్ ను కూడా ఒకే సినిమాతో సాధించినట్టైంది.
మొత్తంగ బాలయ్య బోయపాటి కాంబో అంటే రాబోయే రోజుల్లో అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం అని మళ్లీ నిరూపించిందీ అఖండ. సినిమా ఎలా ఉన్నా.. అఖండగా బాలయ్య నటన పీక్స్ లో కనిపిస్తుంది. ప్రతి పాత్రకూ ఎంతో కొంత ప్రాధాన్యత ఉన్నా.. అఖండగా బాలయ్య ఎంటర్ అయ్యాక అన్ని పాత్రలూ ఆయన ముందు తేలిపోయాయి. కాకపోతే కథాగమనంలో అన్ని పాత్రలనూ టచ్ చేస్తూ సాగింది బాలయ్య అఘోరా పాత్ర. హిందూయిజాన్ని కూడా ఎలివేట్ చేసిన ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే ఓ మెమరబుల్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు.

Advertisement