ఏ హీరోతో ఏ దర్శకుడు ఎప్పుడు సినిమా చేయాలి అనే మేటర్స్ మాగ్జిమం ముందే ఫిక్స్ అయిపోయి ఉంటయి. అనుకోని కారణాలు తగిలితే తప్ప ఇలా ఫిక్స్ అయిపోయిన ప్రాజెక్ట్ లు అటూ ఇటైన సందర్భాలు తక్కువే ఉంటాయి. కాకపోతే ఒక్కోసారి “పెద్దోళ్లు”ఎంటర్ అయితే మారక తప్పని పరిస్థితి ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్ లోనే గతంలో నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉన్న పరశురామ్ సడెన్ గా మహేష్‌ బాబుతో సర్కారు వారి పాట చేయాల్సి వచ్చింది. చాలా ఎక్స్ పెక్ట్ చేసినా ఈ సర్కారువారి పాట అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఇక పరశురామ్ మళ్లీ నాగ చైతన్యతో 14రీల్స్ లో సినిమా చేస్తాడు అనుకున్నారు. చూస్తోంటే ఈ ప్రాజెక్ట్ ఈ సారి కూడా మిస్ అయ్యేలా కనిపిస్తోందంటున్నారు.పరశురామ్ అనే డైరెక్టర్ ను పెద్ద హీరోలు, నిర్మాతలు గుర్తించిన సినిమా గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టింది. కలెక్షన్స్ కాదు కానీ.. పరశురామ్ సెన్సిబుల్ డైరెక్షన్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి.

అందుకే మహేష్ లాంటి స్టార్ కూడా అతనికి ఓకే చెప్పాడు. అప్పుడు మహేష్‌ తో సినిమా ఛాన్స్ వచ్చిందని ఇటు ప్రొడక్షన్ హౌస్ తో పాటు హీరోను కూడా వదిలేశాడు పరశురామ్. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా.. హీరో, నిర్మాణ సంస్థ ఒకే చెప్పిన తర్వాత ఎవరేం చేస్తారు అన్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి సిట్యుయేషన్ లోకే వెళుతున్నాడు పరశురామ్.సర్కారువారి పాటకు మిక్స్ డ్ టాక్ రావడంతో పరశురామ్ తో సినిమాకు నాగ చైతన్య పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. పైగా ఇప్పటి వరకూ అతను కథ కూడా వినలేదంటున్నారు. దీంతో పరశురామ్ తను పెద్ద హిట్ ఇచ్చిన విజయ్ దేవరకొండకు మరో కథ చెప్పాడు అంటున్నారు. ఈ కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కాబట్టి.. ఈ సారి కూడా రష్మిక మందన్నాను తెస్తారు అని కూడా వినిపిస్తోంది.

ఇటు విజయ్ కూడా ప్రస్తుతం ఏ కొత్త ప్రాజెక్ట్ కూ కమిట్ కాలేదు. దీంతో ఈ కాంబో ఫైనల్ అయినట్టే అనుకుంటోన్న ఈ టైమ్ లో సడెన్ గా మళ్లీ సీన్ లోకి బాలకృష్ణ వచ్చారు.రీసెంట్ గా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ .. బాలయ్యతో సినిమా చేయబోతున్నాం అని చెప్పాడు కదా.. దానికి దర్శకుడు పరశురామే ఉంటాడు అంటున్నారు. పైగా పరశురామ్ ఆల్రెడీ గతంలోనే ఓ లైన్ చెప్పి ఉన్నాడనీ.. ఈ లైన్ ను డెవలప్ చేసి.. అనిల్ రావిపూడి తర్వాత బాలయ్య – పరశురామ్ కాంబోలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నారు అనే కొత్త వార్త వచ్చింది. సో పరశురామ్ కు మళ్లీ పాత కథే మొదలైంది. మరోసారి హీరోతో పాటు నిర్మాణ సంస్థకూ హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో అతన్ని మీడియం రేంజ్ ప్రొడక్షన్ హౌస్ లు, హీరోలు నమ్మరు. అయినా ఫర్వాలేదని విజయ్ ని వదిలి బాలయ్య సినిమాకు వెళతాడా లేక ఈ రెండూ కాదని నాగ చైతన్యతోనే సినిమా చేస్తాడా అనేది చూడాలి.

, , , ,