అనుష్క..సమంత.. దీపికా పదుకొనె..ఇంతకి నాగరత్నమ్మ ఎవరు?

అనుష్క..సమంత.. దీపికా పదుకొనె..ఇంతకి నాగరత్నమ్మ ఎవరు?


బెంగుళూరు నాగరత్నమ్మ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ బయోపిక్‌ రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్  జరుగుతుంది. అంతేకాదు ఇందులో టైటిల్‌ పాత్ర కోసం హీరోయిన్లని అన్వేషించే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నారు. మొదట ఇందులో అనుష్కని ఎంపిక చేయబోతున్నట్టు, ఆమె కూడా సుముఖతని వ్యక్తం చేసిందని తెలిసింది. గతంలో స్వీటీ `వేదం` చిత్రంలో వేశ్య తరహా పాత్రలో నటించిన నేపథ్యంలో ఈ అమ్మడు బాగా సెట్‌ అవుతుందని భావించారట. మరి ఆమె నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు గానీ, ఆ తర్వాత సమంత పేరు తెరపైకి వచ్చింది. నాగరత్నమ్మ పాత్రలో `ఓ బేబీ` బ్యూటీని నటింపజేయాలని భావించారు. సమంతతోనూ చర్చలు జరిపారట. ఇటీవల లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో భాగమవుతున్న సమంత ఇందులోనూ నటించే ఛాన్స్ ఉందని టాక్‌ వినిపించింది. కానీ అంతగా సుముఖత లేదనే మరో టాక్‌ వచ్చింది. దీంతో తాజాగా మరో భామ పేరు బాగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్‌ సంచలనం దీపికా పదుకొనె. బాలీవుడ్‌లో హిస్టారికల్‌ చిత్రాలకు, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఈ పద్మావతిని నాగరత్నమ్మగా మార్చాలని సింగీతం భావిస్తున్నారట. ఆమెతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. అయితే దీపికా బాలీవుడ్‌లో పలు క్రేజీ, భారీ చిత్రాల్లో భాగమవుతున్న నేపథ్యంలో సౌత్‌లో సినిమా చేస్తుందా అన్నది ప్రశ్నార్థంగా మారింది. దీపికా నటిగా కెరీర్‌ ప్రారంభించింది సౌత్‌ నుంచే. 2006లో తన తొలి చిత్రం `ఐశ్వర్య` కన్నడలో రూపొందింది. ఆ తర్వాత మరే సౌత్‌ సినిమా చేయలేదు. మధ్యలో రజనీకాంత్‌ యానిమేటెడ్‌ చిత్రం `కొచ్చడయాన్‌`లో మెరిసింది. తప్ప మరే సినిమాలోనూ నటించలేదు. ఓ వైపు బాలీవుడ్‌లో భారీ సినిమాల్లో భాగమవుతూ, ఇంగ్లీష్‌ చిత్రాల ఆఫర్స్ అందుకుంటోన్న నేపథ్యంలో దీపికా సౌత్‌ సినిమాలో నటిస్తుందా? అనే సస్పెన్స్ నెలకొంది. మరి అనుష్క, సమంత, దీపికాపదుకొనె ఈ ముగ్గురిలో నాగరత్నమ్మ ఎవరు అనేది సస్పెన్స్ గా, ఆసక్తికరంగా మారింది. దీపికా ప్రస్తుతం `83`తోపాటు `ది ఇంటర్న్స్`లో నటిస్తుంది. దీంతోపాటు శకున్‌ బట్రా దర్శకత్వంలో ఓ సినిమాకి సైన్‌ చేసినట్టు తెలుస్తుంది

Leave a Reply

Your email address will not be published.