Advertisement
అఖండ ఖాతాలో మరో అరుదైన రికార్డ్
Latest Movies Tollywood Trending News

అఖండ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

Advertisement
అఖండ రికార్డుల మోత కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమా ఆరంభం నుంచి భారీ అంచనాలతోనే మొదలైంది. వాటిని అందుకోవడంలో ఈ టీమ్ ఏ మాత్రం తగ్గలేదు. బోయపాటి డైరెక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అఖండ టైటిల్ కు తగ్గట్టుగానే అఖండ విజయం అందుకుంది. ఈ విజయం పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచిందంటే అతిశయోక్తి కాదు. బాలయ్య నట విశ్వరూపం చూపించడం.. దానికి తమన్ నేపథ్య సంగీతం ఓ రేంజ్ లో సెట్ అవడం, బోయపాటి తనదైన శైలిలో చూపించిన టేకింగ్, ఊరమాస్ ఫైట్స్  అన్నీ కలిసి అఖండను అద్భుత విజయంగా మలిచాయి.
ఇక చాలామంది ఊహించని విధంగా రికార్డ్ స్థాయిలో ఈ కాలంలో కూడా ఈ మూవీ 103 కేంద్రాల్లో యాభై రోజులు ఆడింది. అంతేనా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 50 రోజు కూడా అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఏకైన చిత్రంగానూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ఈ శుక్రవారం నుంచి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రమంలో ఓటిటిలోనూ ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు బాలయ్య.
ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ లో 24 గంటల్లోనే అత్యధిక మంది చూసిన చిత్రంగా అఖండ కొత్త రికార్డ్ సాధించాడు. యస్.. ఇంతకు ముందు కూడా ఈ రికార్డ్ చాలా సినిమాలకు వచ్చింది. బట్ చాలా తక్కువ టైమ్ లోనే రికార్డ్ మాయమైంది. బట్..ఓ మాస్ హీరోకు.. అది కూడా బాలయ్య లాంటి వెటరన్ స్టార్ మూవీకి ఈ స్థాయిలో వ్యూవర్షిప్ రావడం అనూహ్యమే. అందుకే ఈ రికార్డ్ ఎంత త్వరగా కనుమరుగైనా.. బాలయ్యకు, అతని అభిమానులకు సంబంధించి ఓ రేర్ రికార్డ్ గానే మిగిలిపోతుంది.

Advertisement