సినిమా పరిశ్రమలో ఈ మధ్య వరుస మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా హార్ట్ ఎటాక్ తోనే కనిపిస్తుండటం విషాదమైతే అవన్నీ దాదాపు జిమ్ లోనే జరుగుతుండటం ఆశ్చర్యం. ఆ మధ్య కన్నడ హీరోలైన చిరంజీవి సర్జా, పునీత్ రాజ్ కుమార్ ఇలా జిమ్ వల్లే మరణించారు. అలాగే ముంబైలోనే బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన నటుడు కూడా అలా జిమ్ చేసిన తర్వాతే హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ కమెడియన్ రాజీవ్ శ్రీవాత్సవ సైతం ఇలాగే మరణించాడు.సినిమా నటుడుగా కంటే మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎక్కువ ఫేమస్ అయ్యాడు రాజీవ్. ఆయన మిమిక్రీ షోస్ కు ఇండియాలోని టాప్ సెలబ్రిటీస్ అంతా హాజరయ్యేవారు. ఆ స్థాయిలో తనదైన ప్రతిభను చూపించాడు రాజీవ్ శ్రీ వాత్సవ. నిజానికి ఆయన నటించిన సినిమాలు తక్కువే.

అవి కూడా తన ప్రదర్శనల ద్వారా పరిచయం అయిన దర్శక నిర్మాతలు ఆఫర్ చేసినవే. దేశ విదేశాల్లో వేలాది మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు శ్రీవాత్సవ. చాలామంది సెలబ్రిటీస్ ను వారి ముందే అనుకరించి ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా నవ్వించడం అంతని శైలి. వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్ తో నవ్వించిన శ్రీ వాత్సవ వయసు 59యేళ్లుమాత్రమే.గత నెల 10న జిమ్ చేస్తుండగా సడెన్ గా కుప్పకూలిపోయాడు రాజీవ్. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఛాతిలో నొప్పితో బాధపడుతున్న ఆయన్ని వెంటిలేటర్ పై ఉంచారు. ఇవాళ ఉదయం ఆయన కన్నుమూశారు. రాజీవ్ శ్రీవాత్సవ మరణం పట్ల బాలీవుడ్ తో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్,యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఏదేమైనా వ్యాయామం కూడా మితంగా ఉండాలనే హెచ్చరికలు వీరి మరణాల ద్వారా కనిపిస్తున్నాయి.

, , , , , , ,