Advertisement
రేప్ కేస్ లో పోలీస్ లను బెదిరించిన స్టార్ హీరోపై మరో పెద్ద కేస్
Latest Movies Tollywood

రేప్ కేస్ లో పోలీస్ లను బెదిరించిన స్టార్ హీరోపై మరో పెద్ద కేస్

Advertisement
2017 ఫిబ్రవరి 17న కేరళ నటి భావనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా ఆమె కారులో చొరబడి లైంగిక దాడికి ప్రయత్నించిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. ఈ కేస్ ను చాలా సీరియస్ గా తీసుకున్న కేరళ ప్రభుత్వం రెండు రోజుల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది. ప్రధాన నిందుతుడుగా ఉన్న పుల్సార్ సుని నాలుగు రోజుల తర్వాత కోర్ట్ లో లొంగిపోయాడు. అయితే దీని వెనక మళయాల స్టార్ హీరో దిలీప్ హస్తం ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన పోలీస్ లు తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా దిలీప్ వెనక నిలబడ్డా ప్రత్యేక దర్యాప్తు సంస్థ పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేసి అతన్ని అరెస్ట్ చేసింది. అతను కోర్ట్ లో దాదాపు మూడు నెలల పాటు ఉన్నాడు. అయితే దిలీప్ కు నటి మంజు వారియర్ తో పెళ్లైంది. అతను మరో నటి కావ్యా మాధవన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో మంజుకు ఫ్రెండ్ అయిన భావన ఆమెకు చెప్పిందని కక్ష కట్టిన దిలీప్ ఆమెపై ఈ అఘాయిత్యం చేయించాడనేది ప్రధాన ఆరోపణ. మూడు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన దిలీప్ మళ్లీ సినిమాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ కేస్ కోర్ట్ లో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం నియమించిన ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కేస్ నుంచి తప్పుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని మరోసారి హైకోర్ట్ కు వెళ్లింది భావన.
అయితే ఈ వ్యవహారం జరుగుతుండగానే నటుడు దిలీప్ ఆ కేస్ ను దర్యాప్తు చేస్తోన్న స్పెషల్ పోలీస్ లను వేధించాడు. బెదిరించాడని ఆడియో క్లిప్స్  ను దిలీప్ కు అత్యంత సన్నిహితుడు, దర్శకుడుతో పాటు భావన కేస్ లో ఓ ముద్దాయిగా ఉన్న బాలచంద్ర కుమార్ కోర్ట్ కు ఆధారలతో సహా సమర్పించాడు. అంటే ఈ కేస్ లో తనను ఇరికించారు అనే సింపతీ కొట్టేయాలనేది అతని భావన అయినా.. దిలీప్ వాయిస్ క్లిప్ లు నిజం. దీంతో మొదట నియమించిన సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను తొలగించిన ప్రభుత్వం కొత్తగా మరో సిట్ ను ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ కేస్ కూడా దిలీప్ పై కొత్తగా నమోదయ్యింది.
అయితే ఇప్పటి వరకూ దిలీప్ కు అండగా నిలిచి.. భావనను వ్యతిరేకించిన మళయాల పరిశ్రమలోని చాలామంది నటులు దిలీప్ ఏకంగా పోలీస్ లను బెదిరించి కేస్ ను తప్పు దోవ పట్టించాలని ప్రయత్నించాడని తెలిశాక.. ఇప్పుడు బహిరంగంగానే భావనకు మద్ధతు తెలుపుతూ న్యాయం కోసం ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ లను షేర్ చేస్తుండటం విశేషం.

Advertisement