కొన్నాళ్లుగా సినిమాల డేట్స్ అనౌన్స్ కావడం అనేది ఓ ఉద్యమంలా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు… పోటా పోటీగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తూ వెళుతున్నారు. మరి అలా అనౌన్స్ చేసిన వాళ్లంతా చెప్పిన టైమ్ కు వస్తారా అనేది తర్వాత మేటర్ అయితే.. ముందు పోటీ లేకుండా చూసుకోవడం అనే ఓ ఎత్తుగడ కనిపిస్తోంది. అలా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత శాకుంతలం సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. నిజానికి ఈ మూవీకి సంబంధించి ఈ అప్డేట్ ఎప్పుడో రావాల్సింది. బాగా లేట్‌ అయింది. దీంతో ఓ దశలో అసలు సినిమా విడుదలవుతుందా లేదా అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఆ టైమ్ లో సడెన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.


గుణశేఖర్ నిర్మిస్తూ దర్శకత్వం వహించిన సినిమా శాకుంతలం. కాళిదాసు రాసిన కావ్యం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తయింది. ఇక విడుదలే తరువాయి అనుకుంటోన్న టైమ్ లో అనూహ్యంగా మూవీ టీమ్ సైలెంట్ అయింది. ఈ సైలెన్స్ పైనా రకరకాల రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ పై గుణశేఖర్ ఎప్పుడూ స్పందించలేదు. ఖండించలేదు. దీంతో ఇక సినిమా ఆగిపోయినట్టే అనుకున్న టైమ్ లో నవంబర్ 4న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. సో ఇక ఆ టైమ్ కు ఈ వెండితెర కావ్యం చూడొచ్చు అనుకున్న ఫ్యాన్స్ కు మరో షాకింగ్ న్యూస్ చెప్పాడు గుణశేఖర్.


ఈ చిత్రాన్ని ముందు చెప్పినట్టుగా నవంబర్ 4న విడుదల చేయడం కుదరడం లేదు అని లేటెస్ట్ గా ప్రకటించాడు. అందుకు కారణం.. ఈ మూవీని త్రీడీ ఫార్మాట్ లోకి మారుస్తున్నాం అని.. అందుకోసం కొంత టైమ్ పడుతుందనీ.. త్రీడీలో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియన్స్ ఫీలవుతారని లాంటి కారణాలతో తమ చిత్రాన్ని నవంబర్ 4న రిలీజ్ చేయడం లేదు అని చెప్పారు.


నిజానికి తెలుగు స్టేట్స్ లో త్రీడీ వెర్షన్ కు తగ్గ టెక్నాలజీ ఉన్న థియేటర్స్ పెద్ద సంఖ్యలో లేవు. కేవలం మహా నగరాల్లో మాత్రమే కనిపిస్తాయి. అలాంటి త్రీడీ కోసం ఎంతో ఖర్చుపెట్టడం అవసరమా అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. పైగా గుణశేఖర్ గతంలోనే రుద్రమదేవి త్రీడీ విషయంలో ఎక్కువగా నష్టపోయి ఉన్నాడు. అయినా మరోసారి అదే ఎక్స్ పర్మెంట్ చేయడం ఎంత వరకూ సబబు అనేది అతనే ఆలోచించుకోవాలి. ఎందుకంటే తేడా వస్తే కేవలం దర్శకుడుగానే కాదు.. నిర్మాతగా భారీగా నష్టపోతాడు.

, , , , , , , , ,